సీఎం చంద్రబాబు ఏపీ వాటర్ మ్యాన్.. కృష్ణా డెల్టా రైతుల ప్రశంసలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 02:34 PM
పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 11 ఏళ్లలో 500 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు తరలించి సద్వినియోగం చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుతో సాధించిన జలవిజయం సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 11 ఏళ్లలో 500 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు తరలించి సద్వినియోగం చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుతో సాధించిన జలవిజయం సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. పట్టిసీమ లిఫ్టు ద్వారా నీటిని తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలకు రైతన్నలు సహకరించారని తెలిపారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును.. మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ఈరోజు (శనివారం) కలిశారు.
రైతన్నలకు సీఎం ప్రశంసలు..
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్టాడెల్టాకు ఇప్పటి వరకూ 500 టీఎంసీల నీటిని తీసుకువచ్చిన చంద్రబాబుకు రైతన్నలు ధన్యవాదాలు తెలిపారు. సీఎంను శాలువాతో అన్నదాతలు, సాగునీటి సంఘాల ప్రతినిధులు సత్కరించారు. కృష్ణాడెల్టాకు గోదావరి నీటిని, శ్రీశైలంలో పొదుపు చేసిన కృష్ణా నీటిని రాయలసీమకు సీఎం చంద్రబాబు ఇచ్చి ఏపీకి జలప్రదాత అయ్యారని రైతన్నలు కొనియాడారు. అన్ని ప్రాంతాలకూ నీటి భరోసా కల్పించిన చంద్రబాబు ఏపీ వాటర్‌మ్యాన్ అంటూ రైతన్నలు ప్రశంసలు కురిపించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీటితో కృష్ణాడెల్టాలో సిరులు పండించారని రైతులను సీఎం చంద్రబాబు కొనియాడారు.
ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రానికి జల భద్రత తీసుకువస్తాం: సీఎం
కాలువలను విస్తరించి రాష్ట్రానికి మరింత ప్రయోజనం కల్పించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఈ ప్రాంత రైతుల కష్టాన్ని తీర్చి సంపద సృష్టించిందని పేర్కొన్నారు. కృష్ణాబేసిన్‌లో గోదావరి జలాలను వినియోగిస్తూ పొదుపు చేసుకున్న కృష్ణాజలాలను రాయలసీమలో సాగు, తాగునీటికి మళ్లించామని తెలిపారు. రాయలసీమలో కియా లాంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలకు కూడా నీరు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రానికి జల భద్రత తీసుకువస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట
స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News