Share News

ఈడీ సోదాలతో జగన్‌కు వెన్నులో వణుకు మొదలైంది.. విజయ్ సెటైర్లు

ABN , Publish Date - Jun 11 , 2026 | 05:16 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ అధికారుల సోదాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసత్య ఆరోపణలతో జగన్ మీడియా ముందుకు వచ్చారని ధ్వజమెత్తారు.

ఈడీ సోదాలతో జగన్‌కు వెన్నులో వణుకు మొదలైంది.. విజయ్ సెటైర్లు
Chintakayala Vijay

అమరావతి, జూన్11, (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ (Chintakayala Vijay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ అధికారుల సోదాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసత్య ఆరోపణలతో జగన్ మీడియా ముందుకు వచ్చారని ధ్వజమెత్తారు. జగన్ పీఏ సహా అనుచరగణమంతా ఈడీ సోదాల్లో అడ్డంగా దొరుకుతుండటంతో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారని ఎద్దేవా చేశారు. ఈరోజు (గురువారం) అమరావతి వేదికగా విజయ్ మీడియాతో మాట్లాడారు.


కాక్రోచ్‌లు వచ్చేది జగన్ కోసమే..

ఈడీ సోదాలతో అసలు సూత్రధారి జగన్‌కు వెన్నులో వణుకు మొదలైందని విజయ్ విమర్శించారు. ఈడీ తన దాకా వస్తుందని.. ఆయనకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కాక్రోచ్‌లు వచ్చేది జగన్ కోసమేనని సెటైర్లు గుప్పించారు. జెన్ జీ, జెన్ ఆల్ఫాతో ఉండటంతోనే.. గత ఎన్నికల్లో 11సీట్లకు గొడ్డలి పార్టీని ప్రజలు పరిమితం చేశారని విమర్శించారు. వెన్నుపోటు, గొడ్డలి పార్టీ, కోడి కత్తి, డైవర్షన్ రాజకీయాలకు ప్యాంటు, షర్టు వేస్తే అది జగన్‌లాగా ఉంటుందని సెటైర్లు గుప్పించారు.


తెలుగుదేశం పార్టీకి ప్రయోగాలు కొత్త కాదు..

చంద్రబాబు, లోకేశ్‌లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీలో బీసీలకు ఎప్పుడూ న్యాయం జరుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి ప్రయోగాలు కొత్త కాదని.. పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తామని చింతకాయల విజయ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత

ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 06:20 PM