జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:44 PM
జగన్ మోహన్ రెడ్డి హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.5.46 కోట్లు కేటాయించి, పనులు చేపట్టామని పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): జగన్ మోహన్ రెడ్డి హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ( Home Minister Vangalapudi Anita) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.5.46 కోట్లు కేటాయించి, పనులు చేపట్టామని పేర్కొన్నారు.
రాబోయే మూడేళ్లలో నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అనిత వ్యాఖ్యానించారు. పాయకరావుపేట నియోజకవర్గాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రెండేళ్లలో పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై హోంమంత్రి అనిత ఈరోజు (బుధవారం) మీడియా సమావేశం నిర్వహించారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఫొటోలతో సహా వివరించారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో రెండేళ్లలో సుమారు రూ.1,150 కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అనిత చెప్పుకొచ్చారు.పాయకరావుపేట నియోజకవర్గం నాలుగు మండలాల పరిధిలోని పంచాయతీరాజ్‌లో 871 పనులకు గానూ, రూ.118 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. గ్రామాల అభివృద్ధి కోసం 172 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించామని తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో ఆర్ అండ్ బీలో 36 పనులకు గానూ 137 కిలోమీటర్ల రోడ్డు, రూ.130 కోట్లతో అభివృద్ధి చేశామని వివరించారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించటం కోసం రూ. 66 కోట్లతో 244 పనులు చేపట్టామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం ఫోకస్.. డేటా డ్రివెన్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం
లోకేశ్‌పై జగన్ అండ్ కో ఫేక్ ప్రచారాలు చేస్తోంది.. రామ్మోహన్ ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News