Share News

ప‌బ్ జీ ఆడుకునే జ‌గ‌న్‌కు ఏపీ అభివృద్ధిపై అవ‌గాహ‌న శూన్యం.. మంత్రి ఎద్దేవా

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:37 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు, రాయలసీమ అభివృద్ధిపైనా విషప్రచారమేనా? అని ప్రశ్నించారు.

ప‌బ్ జీ ఆడుకునే జ‌గ‌న్‌కు ఏపీ అభివృద్ధిపై అవ‌గాహ‌న శూన్యం.. మంత్రి ఎద్దేవా
AP Minister Kinjarapu Atchannaidu

అమరావతి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (AP Minister Kinjarapu Atchannaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు, రాయలసీమ అభివృద్ధిపైనా విషప్రచారమేనా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడమంటే దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. ఈరోజు (ఆదివారం) అమరావతి వేదికగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.


తాడేప‌ల్లిలో ప‌బ్ జీ ఆడుకునే జ‌గ‌న్‌కు రైతుల సంక్షేమం, అభివృద్ధి ప‌ట్ల అవ‌గాహ‌న శూన్యమని మంత్రి విమర్శించారు. ఉద్యాన రంగంలో 17 శాతం నుంచి 21 శాతం వృద్ధి సాధించామని.. ఈ గణాంకాలే తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఉద్ఘాటించారు. లక్ష కోట్ల పెట్టుబడులకు, బడ్జెట్ కేటాయింపులకు తేడా తెలియదా జ‌గ‌న్? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 19వ స్వర్ణం.. పవన్, లోకేశ్ అభినందనలు

బీసీలకు వైసీపీ అన్యాయం చేసింది.. రామ్మోహన్ ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 05:48 PM