Share News

అర్నబ్ తుఫాన్ ప్రభావం.. ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:55 PM

తుఫాన్ నేపథ్యంలో పలు జిల్లాలోని పాఠశాలలకు సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా, రాజమండ్రి జిల్లాల్లో అక్టోబరు 27, 28 తేదీల్లో విద్యాసంస్థలకు సెలువులు ఇస్తున్నట్లు రాష్ట్ర సర్కార్ వెల్లడించింది.

అర్నబ్ తుఫాన్ ప్రభావం.. ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
Arnab Cyclone Alert

అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుఫాన్ వేగంగా కదులుతోందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోందని తెలిపారు. ప్రస్తుతానికి విశాఖపట్నానికి 580 కిలోమీటర్లు, కాకినాడకు 660 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 760 కిలోమీటర్లు, బాపట్లకు 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వివరించారు. తుఫాన్ దగ్గరకు వచ్చే కొద్ది తీవ్రమవుతోందని తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో పలు జిల్లాలోని పాఠశాలలకు సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.


కృష్ణా జిల్లాలో మంగళవారం, బుధవారం సెలవులు..

అర్నబ్ తుఫాను దృష్ట్యా మంగళవారం, బుధవారం కృష్ణా జిల్లాలోని పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.

రాజమహేంద్రవరంలో..

అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో అక్టోబరు 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలోని విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యవసర కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కలెక్టరేట్, రాజమహేంద్రవరం: 08832-944455, సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం: 08832-442344, ఆర్డీవో కార్యాలయం, కొవ్వూరు: 08813-231488 నంబర్లలో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

జడ్పీ పీఠాలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో భేటీ తర్వాతే క్లారిటీ!

రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్.. రూ. 2, 500 కోట్లతో BEL ప్రాజెక్టు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 05:05 PM