రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్.. రూ. 2, 500 కోట్లతో BEL ప్రాజెక్టు
ABN , Publish Date - Oct 25 , 2026 | 08:32 PM
ఏపీలో రక్షణ రంగ తయారీకి సంబంధించిన పరిశ్రమల అభివృద్దికి కీలక ముందడుగు పడుతోందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఏపీలో రక్షణ రంగ తయారీకి సంబంధించిన పరిశ్రమల అభివృద్దికి కీలక ముందడుగు పడుతోందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు.
‘కేంద్ర ప్రభుత్వ రంగంలోని నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి రక్షణ రంగానికి సంబంధించిన వ్యవస్థను (defence ecosystem) నిర్మించడానికి శ్రీసత్యసాయి జిల్లాలో 914 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,500 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీనివల్ల మన యువతకు హై-టెక్ డిఫెన్స్ తయారీ రంగాలు, 800 నాణ్యమైన ఉద్యోగాలు లభించడంతో పాటు రాయలసీమలో సరఫరాదారుల వ్యవస్థ (supplier base) కూడా పెరుగుతుంది. మనం చెప్పాము, చేసి చూపించాం’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
కర్నూలు నగర అభివృద్ధి కోసం స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News