జడ్పీ పీఠాలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో భేటీ తర్వాతే క్లారిటీ!
ABN , Publish Date - Oct 25 , 2026 | 03:04 PM
స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి పక్షాల సర్దుబాటు చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల సర్దుబాటుపై కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత జనసేన, బీజేపీ నేతలతో సమావేశమై ఈ విషయంపై చర్చించనున్నారు.
అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై (AP Local Body Elections) కూటమి పక్షాల సర్దుబాటు చర్చలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల సర్దుబాటుపై కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత జనసేన, బీజేపీ నేతలతో సమావేశమై ఈ విషయంపై చర్చించనున్నారు. ఈ భేటీ తర్వాత ఆయా పదవులపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సర్దుబాటు బాధ్యతను స్థానిక నేతలకు రాష్ట్ర నాయకులు అప్పగించారు. జడ్పీ ఛైర్మన్ స్థానాలపై రాష్ట్రస్థాయిలో సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి. తమకు ఎనిమిది జడ్పీ స్థానాలు కావాలని జనసేన కోరిన విషయం తెలిసిందే.
జనసేనకు 6 జడ్పీ ఛైర్మన్ స్థానాలు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. తమకు రెండు స్థానాలు ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. బీజేపీకి జడ్పీ ఛైర్మన్ స్థానాలు దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. మొత్తం 28 జడ్పీ ఛైర్మన్, 659 జడ్పీటీసీ స్థానాలపై కూటమి కసరత్తు చేస్తోంది. 660 ఎంపీపీ, 9,829 ఎంపీటీసీ స్థానాలపై అవగాహన కుదరాల్సి ఉంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జడ్పీ స్థానాలను జనసేనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో 4 జడ్పీ ఛైర్మన్ స్థానాలను కూడా జనసేనకు కేటాయించే ఛాన్స్ ఉంది. ఈరోజు (ఆదివారం) రాత్రికి కూటమి పక్షాలు పోటీ చేసే జాబితాపై ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.
పశ్చిమగోదావరి జడ్పీ ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ..
పశ్చిమగోదావరి జడ్పీ ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. జడ్పీ ఛైర్మన్ రేసులో జనసేన నుంచి పీవీఎల్ నరసింహారాజు, తెలుగుదేశం పార్టీ నుంచి పోత్తూరు రామాంజనేయరాజు పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతలు ఉండి మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నివాసంలో పలువురు నేతలు సమావేశమై ఈ విషయంపై చర్చిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
కర్నూలు నగర అభివృద్ధి కోసం స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News