సభకు రానివాళ్లు ఎమ్మెల్యేలుగా ఎందుకు?
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:14 AM
వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడంలేదని, సభకు రానివాళ్లు ఎమ్మెల్యేలుగా ఎందుకని, అలాంటివారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. బుధవారం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకివ్వాలి: స్పీకర్
వారికి అమరావతి క్వార్టర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపుపై చర్చించి నిర్ణయం: స్పీకర్ అయ్యన్న
అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడంలేదని, సభకు రానివాళ్లు ఎమ్మెల్యేలుగా ఎందుకని, అలాంటివారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. బుధవారం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సభకు రానివారికి వేతనాలు ఇవ్వకూడదని, 11మంది వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై కేంద్రానికి నివేదిక కూడా పంపానని తెలిపారు. డ్యూటీ చేయని ఎమ్మెల్యేలకు జీతాలు కట్ చేసేలా కేంద్రం చట్టం చేయాలని కోరారు.
6 నెలలపాటు సభకు రాకుంటే అనర్హత వేటు వేసే అంశంపై వివిధ స్థాయుల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు అమరావతి క్వార్టర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో కొందరు సభ్యులు సభకు రాకుండా నాలుగైదు రోజుల తర్వాత వచ్చి సంతకాలు చేసే దొంగ పద్ధతి ఉండేదని, దానికి స్వస్తి పలుకుతూ తమ హయాంలో డిజిటల్ ఫేస్ రికగ్నిషన్, కెమెరా అటెండెన్స్ తీసుకోచ్చామని వివరించారు. సభ్యులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే హాజరు పడుతుందని స్పష్టం చేశారు. సభలో అవసరమైనంత సంఖ్యా బలం లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యపడదని, ప్రతిపక్ష హోదా లేని నేతకు సీఎంతో సమానంగా సమయం కేటాయించడం కుదరదన్నారు.
వార్తలు కూడా చదవండి...
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం
నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News