Share News

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

ABN , Publish Date - Aug 12 , 2026 | 05:32 PM

అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించనున్నారు.

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం
Amaravati Development

అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రేపు (గురువారం) ప్రారంభించనున్నారు. అమరావతిలో కీలకమైన 9 లేన్ల రహదారిగా సీడ్ యాక్సిస్ రోడ్డును ప్రభుత్వం నిర్మిస్తుంది. ఈ రోడ్డుకు సెంట్రల్ BRTSతో పాటు ఇరువైపులా 11 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్లను నిర్మించనుంది.


అమరావతిలో ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే N1 నుంచి N17 రోడ్లన్నీ సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానం చేయనుంది. దొండపాడు నుంచి తాడేపల్లి వరకు NH-16కు సీడ్ యాక్సిస్ రోడ్డు అనుసంధానం కానుంది. ఈ రోడ్డు 21.77 కిలోమీటర్ల మొత్తం పొడవు ఉంది. మూడు దశల్లో ఈ రోడ్డును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది. ఫేజ్-1లో దొండపాడు నుంచి వెంకటపాలెం మంతెన ఆశ్రమం వరకు 14.35 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డును నిర్మించనుంది. ఫేజ్-2లో వెంకటపాలెం నుంచి ఉండవల్లి పాత జాతీయ రహదారి వరకు 3.92 కిలోమీటర్లకు ఈ రోడ్డును విస్తరించనుంది.


ఫేజ్-2లో రెండు స్టీల్ బ్రిడ్జిల నిర్మాణాలను ఏపీ సర్కార్ పూర్తి చేయనుంది. ఫేజ్-3లో 3.50 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనుంది. ఉండవల్లిలో బకింగ్‌హామ్ కెనాల్‌పై 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయనుంది. కొండవీటి వాగు, గుంటూరు ఛానల్‌పై 280 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది. అమరావతి రహదారి అనుసంధానంలో సీడ్ యాక్సిస్ రోడ్డు కీలకంగా మారనుంది.


వార్తలు కూడా చదవండి...

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 06:14 PM