Share News

అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

ABN , Publish Date - Aug 11 , 2026 | 06:39 PM

అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
Amaravati Seed Access Road

అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు (Amaravati Seed Access Road) నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ఈరోజు (మంగళవారం) ఈ వ్యాజ్యాలను కొట్టివేసింది.


ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ తీర్పు ఇచ్చారు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విషయంలో అధికారులు చట్టనిబంధనలు అనుసరించలేదని, భూసేకరణ నోటిఫికేషన్‌తో పాటు దానికి అనుగుణంగా ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ పెనుమాక, ఉండవల్లి గ్రామాలకు చెందిన పలువురు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


వార్తలు కూడా చదవండి...

రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను అణిచివేస్తాం.. సీఎం వార్నింగ్

గుడ్‌న్యూస్.. పొగాకు రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణం

వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 11 , 2026 | 06:55 PM