గుడ్‌న్యూస్.. పొగాకు రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణం
ABN , Publish Date - Aug 10 , 2026 | 01:18 PM
పొగాకు రైతులకు ఒక్కొక్కరికి రూ.50 వేలను రుణం రూపంలో అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. రెండేళ్ల పాటు వడ్డీ లేకుండా రూ. 50 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తరపున క్వింటాలుకు రూ.1000లను ఇస్తామని తెలిపారు.
గుంటూరు జిల్లా, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పొగాకు రైతులకు ఒక్కొక్కరికి రూ.50 వేలను రుణం రూపంలో అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (AP Minister Atchannaidu) ప్రకటించారు. రెండేళ్ల పాటు వడ్డీ లేకుండా రూ.50వేలు ఇస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తరఫున క్వింటాలుకు రూ.1000లను అందజేస్తామని తెలిపారు. పొగాకు కొన్న 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఏడాది పొగాకు సాగు 80 మిలియన్ కిలోలకు కట్టడి చేయాలని నిర్ణయించామని అన్నారు. దీన్ని కూడా రాజకీయం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా పని చేసిన గొడ్డలి పార్టీ అధినేత లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు.
గుంటూరు జిల్లాలోని టోబాకో బోర్డు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు (సోమవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పొగాకు రైతుల సమస్యలు, ధరలు, కొనుగోళ్ల తీరుపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయులు, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, టోబాకో బోర్డు అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు.
జగన్ హయాంలో పొగాకు ధరలు తగ్గినా, చేసిందేమీ లేదు..
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హయాంలో పొగాకు ధరలు తగ్గినా, చేసిందేమీ లేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ హయాంలో కేవలం 11 మిలియన్ కిలోలు మాత్రమే మార్క్‌ఫెడ్ ద్వారా కొన్నారని ప్రస్తావించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే పొగాకు రైతులకు మేలు జరిగిందని తెలిపారు. రైతులు ఈ విషయం గుర్తించాలని.. వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. పొగాకు నాణ్యత నిర్థారణ కోసం ఐదుగురు సభ్యుల కమిటీ వేశామని వెల్లడించారు. గ్రేడ్ తక్కువని చెప్పి వ్యాపారులు ఇష్టారాజ్యంగా చేసేందుకు వీల్లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
వార్తలు కూడా చదవండి...
ఎల్‌నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారం: సీఎం చంద్రబాబు
అరాచకాలు, అక్రమాలు చేసే వైసీపీ కనుమరుగైపోయింది: మంత్రి డీబీవీ స్వామి
శ్రీశైల మల్లన్న భక్తులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత
Read Latest AP News And Telangana News And National News
And Telugu News