శ్రీశైల మల్లన్న భక్తులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత
ABN , Publish Date - Aug 09 , 2026 | 08:13 PM
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో స్వామివారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది.
నంద్యాల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మల్లన్న ఆలయానికి (Srisailam Temple) భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో స్వామివారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. అలాగే, వరుణయాగం సందర్భంగా ఈరోజు (ఆదివారం) , రేపు (సోమవారం) ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలు నిలిపివేశారు.
భక్తుల వాహనాలు ఎక్కువగా రావడంతో శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో శ్రీశైలం రహదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం టోల్‌గేట్ నుంచి ముఖద్వారం వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వార్తలు కూడా చదవండి...
ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
వివేకా కేసు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల
Read Latest AP News And Telangana News And National News
And Telugu News