Share News

వివేకా కేసు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ

ABN , Publish Date - Aug 08 , 2026 | 06:18 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వివేకా కుమార్తె సునీతారెడ్డి సంచలన లేఖ రాశారు. ఏడేళ్లు దాటినా ఈ కేసు మిస్టరీ ఇంకా తేలలేదని పేర్కొన్నారు.

వివేకా కేసు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ
YS Vivekananda Reddy Case

కడప, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు (President Droupadi Murmu) వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి (YS Sunitha Reddy) సంచలన లేఖ రాశారు. ఏడేళ్లు దాటినా ఈ కేసు మిస్టరీ ఇంకా తేలలేదని పేర్కొన్నారు. 'ఆ నాలుగు కీలక అంశాలపై' దర్యాప్తు జరగాల్సిందేనని ఆమె విజ్ఞప్తి చేశారు. హత్య జరిగి ఏడేళ్లవుతున్నా ఇందుకు సంబంధించిన ఆయుధం ఇంకా దొరకలేదని తెలిపారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై సునీతారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.


రూ.కోట్ల మనీ ట్రయల్, హత్య వెనుక ఉన్న 'పెద్ద కుట్ర' కోణాన్ని పూర్తిగా వెలికితీయాలని రాష్ట్రపతికి సునీతారెడ్డి విన్నవించారు. మరణవార్త బయటకు రాకముందే వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది? అని ప్రశ్నించారు. సీబీఐ అఫిడవిట్ ఆధారంగా ఈ కేసును విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఇంకా ఉన్న 'అస్పష్ట అంశాలపై' విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో గతంలో అప్పీల్ చేశానని ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ - తెలంగాణ సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డిలకు కూడా లేఖ ప్రతులను డాక్టర్ సునీతారెడ్డి పంపించారు.


వార్తలు కూడా చదవండి...

జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి నాకు రెండు నిమిషాలు చాలు: సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ మానవత్వం.. కళాకారుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు

శ్రీకాళహస్తి వ్యాసాశ్రమం వివాదం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 08:04 PM