జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి నాకు రెండు నిమిషాలు చాలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 06 , 2026 | 02:49 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది.
అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) అధ్యక్షతన ఈరోజు (గురువారం) రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. మూడున్నర గంటల పాటు ఆయా అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. స్థానిక ఎన్నికలకు మంత్రులు, కూటమి నేతలు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
వారిని కంట్రోల్ చేయడానికి నాకు రెండు నిమిషాలు చాలు..
జగన్ అండ్ కో చేస్తున్న అరాచకాలను కంట్రోల్ చేయడానికి తనకు రెండు నిమిషాలు చాలని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ అంత రాజకీయ ముసుగులో వారు నేరాలు చేస్తున్నారని ఆగ్రహించారు. డీఎస్సీపై చేస్తున్న రాద్దాంతాన్ని కూడా అందరు గమనిస్తున్నారని తెలిపారు. అన్ని విషయాలు డీఎస్సీపై మనం ప్రజలకు వివరించామని అన్నారు. వైసీపీ నేతలు కోర్టులతో కూడా చీవాట్లు పడ్డారని విమర్శించారు. అయినా వైసీపీ నేతలు యాగీ చేస్తున్నారని ఆగ్రహించారు. డీఎస్సీపై వైసీపీ నేతలు ఇప్పుడు ధర్నాలు చేయడం ఏంటి? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతలకు అసలు రిజర్వేషన్ల గురించి తెలియదని విమర్శించారు. డీఎస్సీలో హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై.. అందరికీ తెలపాల్సిన బాధ్యత మంత్రులదేనని ఆదేశించారు.
ఈ నెలాఖరుకు వెలుగొండ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాం..
ఈ నెలాఖరుకు వెలుగొండ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజలకు తాగునీటి కోసం నీళ్లు ఇస్తామని వెల్లడించారు. ఎల్‌నినో గురించి మంత్రులు ప్రజలకు తెలపాలని సూచించారు. ఇంత వర్షాభావం ఉన్న కూడా మంచినీటికి కూడా మనం నీళ్లు ఇస్తున్నామనేది ప్రజలకు వివరించాలని అన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా తొలిసారి థింసా గిరిజన నృత్యానికి గిన్నిస్ రికార్డు వచ్చిందని ప్రస్తావించారు. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర ప్రజల్లో ఓ సెంటిమెంట్‌ను తీసుకువచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. అక్కడ ల్యాండింగ్ కూడా సముద్రం మీద నుంచి వచ్చే విధంగా ఏర్పాటు చేశామని వివరించారు. స్వర్ణాంధ్ర, వికసిత భారత్ ఈ రెండు స్వాతంత్య దినోత్సవ సందర్భంగా మంత్రుల ప్రసంగాల్లో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. క్వాంటం వ్యాలీ జనవరిలో ప్రారంభమవుతుందని ప్రకటించారు.
‘దిశా’ అసలు చట్టం రూపం నోచుకోలేదు..
‘దిశా’ అనేది అసలు చట్టం రూపం నోచుకోలేదని సీఎం తెలిపారు. అయినా ‘దిశా’ పోలీస్ స్టేషన్లు, వాహనాలని చెప్పి హడావుడి చేశారని దుయ్యబట్టారు. ‘దిశా’ చట్టం అని పంపితే కేంద్రప్రభుత్వం తిరస్కరించి వెనక్కు పంపిందని ప్రస్తావించారు.
దేవరపల్లిలో పొలాలను గొడ్డలి పార్టీ శ్రేణులు నాశనం చేశారు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న దేవరపల్లిలో పర్యటించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన పర్యటన సందర్భంగా రైతన్నల పొలాలను గొడ్డలి పార్టీ శ్రేణులు నాశనం చేశాయని ధ్వజమెత్తారు. ఓ మహిళ చిరు వ్యాపారి పొట్టగొట్టడంతో పాటు హిందూ దేవుళ్ల చిత్ర పటాలు పగలకొట్టడం ఆక్షేపనీయమని అన్నారు. పొగాకు బేళ్లను తొక్కి నాశనం చేసి పరామర్శ ముసుగు తగిలించుకున్నారని ఆగ్రహించారు. అనేకమంది రైతులు తనకు మెసేజ్‌లు పంపారని తెలిపారు. తమ పంట దెబ్బతిందని అన్నదాతలు తనకు వివరించారని అన్నారు. చివరకు జగన్ పరామర్శలు అంటే జనం భయపడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
రాజకీయ పార్టీల ముసుగులో క్రిమినల్స్..
రాజకీయ పార్టీల ముసుగులో క్రిమినల్స్ తయారవుతున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉండే జిల్లాల్లో శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ మీటింగ్ అంటే లైసెన్స్ ఇచ్చినట్లుగా మందు తాగించి ప్రజలను తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. గంజాయి బ్యాచ్‌ను జెన్ జీ అని చెప్పుకోవడం గొడ్డలి పార్టీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు. ఆక్వా రైతులకు ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ అనే తేడా లేకుండా రూ.1100కోట్లు విద్యుత్ రాయితీలు ఇచ్చామని ప్రస్తావించారు. ఆక్వా ఫీడ్ ఎక్స్‌పోర్ట్ 50శాతం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని తెలిపారు.
13న సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభిస్తాం: మంత్రి నారాయణ
ఈ నెల 13వ తేదీన సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో సీఎం కాన్వాయ్ ప్రయాణించి నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు వస్తుందని వెల్లడించారు. అక్కడ వాటి తాళాలను ముఖ్యమంత్రికి అందజేస్తారని చెప్పారు. విజయదశమి నాటికి మంత్రుల క్వార్టర్స్‌ను సిద్ధం చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
అగ్రిగోల్డ్ అంశంపై చర్చ..
అగ్రిగోల్డ్ అంశంపై కేబినెట్‌లో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో కేబినెట్ సబ్ కమిటీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అగ్రిగోల్డ్ బాధితులు 11 రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు సాధ్యమైనంతవరకు త్వరగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. భూములు వేలం వేయడంలో సరైన ధర రావాలని సూచించారు. బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వేలంతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలు కూడా చూడాలని కేబినెట్ సబ్ కమిటీకు సూచించారు. ఇప్పటికే 15 ఏళ్లు పూర్తి అయిందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. కేబినెట్ సబ్ కమిటీ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
వార్తలు కూడా చదవండి...
విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
పవన్ కల్యాణ్ ఆదేశాలతో పులుల మరణాలపై అధికారుల ముమ్మర తనిఖీలు.. పట్టుబడ్డ పులిగోర్లు
ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోంది: లోకేశ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News