Share News

శ్రీకాళహస్తి వ్యాసాశ్రమం వివాదం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Aug 06 , 2026 | 06:08 PM

శ్రీకాళహస్తిలోని వ్యాసాశ్రమం వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు.

శ్రీకాళహస్తి వ్యాసాశ్రమం వివాదం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Government

తిరుపతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తిలోని వ్యాసాశ్రమం వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న మలయాళ స్వామి పూర్వ విద్యార్థుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్నారు. బీజేపీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్ కోలా ఆనంద్ ఫిర్యాదు ఆధారంగా తక్షణం విచారణ చేసి పూర్వ వైభవానికి చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఈరోజు (గురువారం) కలెక్టరేట్‌లో పూర్వ విద్యార్థులు, పీఠాధిపతులతో సమావేశం నిర్వహించారు. సీఎం చొరవకు మలయాళ స్వామి పూర్వ విద్యార్థులు, రాష్ట్రంలోని వివిధ పీఠాల స్వాములు హర్షం వ్యక్తం చేశారు.


శతాబ్ది ఉత్సవాలు వాయిదా..

ఆగస్టు 27వ తేదీన జరగాల్సిన శతాబ్ది ఉత్సవాలను వాయిదా వేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ ఆశ్రమం ఎండోమెంట్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. 20c పరిధిలోకి వచ్చే ఈ ఆశ్రమ ఆస్తుల అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మలయాళ స్వామి వీలునామాలోని కీలక అంశాలను అమల్లోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ ఆశ్రమంలో జరగాల్సిన రోజు వారి కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి ట్రస్టును పునర్ నియమిస్తామని వెల్లడించారు. అమర్‌నాథ్ రెడ్డి అనే వ్యక్తి వల్ల ఆశ్రమానికి చెడ్డ పేరు వస్తే ఆయనను వెంటనే బయటకు పంపిస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. ఏర్పేడు ఆశ్రమంలో బంగ్లా కట్టుకుని అరాచకాలు చేస్తున్న అమర్‌నాథ్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని సుధీర్ రెడ్డి వెల్లడించారు. ఈ ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలపై దేవదాయ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకుపోయామని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ ఆశ్రమం అక్రమాలపై చర్యలు: ఎస్పీ సుబ్బరాయుడు

మలయాళ స్వామి తిరుణామా ప్రకారం పూర్వ విద్యార్థులతో ఏర్పడనున్న అభివృద్ధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆశ్రమం నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు తన విలువైన సమయాన్ని ఈ ఆశ్రమం కోసం కేటాయించటం చాలా గొప్ప విషయమని బీజేపీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జి కోలా ఆనంద్ చెప్పారు. ఈ ఆశ్రమంలో జరుగుతున్న అన్ని అక్రమాలను ముఖ్యమంత్రికి వివరించామని అన్నారు. సీఎం చంద్రబాబు వ్యాసాశ్రమం గురించి చాలా బాగా స్పందించారని అన్నారు. సీఎం చొరవతో వ్యాసాశ్రమానికి పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో ఈ ఆశ్రమంలో అవకతవకలకు కారణమైన దుర్మార్గులపై కఠిన చర్యలు ఉంటాయనే నమ్మకం అందరిలో కలిగిందని కోలా ఆనంద్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

పవన్ కల్యాణ్ ఆదేశాలతో పులుల మరణాలపై అధికారుల ముమ్మర తనిఖీలు.. పట్టుబడ్డ పులిగోర్లు

ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోంది: లోకేశ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 06:54 PM