ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Aug 08 , 2026 | 08:52 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 17వ తేదీన ఉదయం 10 గంటలకు శాసన మండలి మొదలు కానుంది. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 17వ తేదీన ఉదయం 10 గంటలకు శాసన మండలి మొదలు కానుంది. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు (శనివారం) నోటిఫికేషన్ విడుదల చేశారు. శాసనసభ, శాసనమండలి సెషన్ సమావేశానికి అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు.
నాలుగు రోజుల పాటు 50వ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 17వ తేదీ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయని నోటిఫికేషన్‌లో గవర్నర్ పేర్కొన్నారు. 17వ తేదీ ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 17వ తేదీ ఉదయం ఉభయ సభల బీఏసీలు సమావేశం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి, అజెండాను ఉభయ సభల బీఏసీలు ఖరారు చేయనున్నాయి.
వార్తలు కూడా చదవండి...
జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి నాకు రెండు నిమిషాలు చాలు: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ మానవత్వం.. కళాకారుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు
శ్రీకాళహస్తి వ్యాసాశ్రమం వివాదం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News