వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:32 AM
వైసీపీ నేతలపై ఏపీ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
కర్నూలు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలపై ఏపీ మంత్రి టీజీ భరత్ (AP Minister TG Bharat) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈరోజు (సోమవారం) కర్నూలు జిల్లాలో మంత్రి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూలు వైసీపీ రౌడీ మూకలు హత్యలు, హత్యాయత్నాలతో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహించారు.
ఇంతియాజ్‌ను దారుణంగా హత్య చేశారు..
పక్కా పథకం ప్రకారం టీడీపీ కార్యకర్త ఇంతియాజ్‌ను దారుణంగా హత్య చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు గురైన ఆయన గడిచిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారని ప్రస్తావించారు. అప్పట్లో తన నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని వైసీపీ వర్గీయులు ఇంతియాజ్‌ను బెదిరించారని.. ఇంటికెళ్లి గొడవకు దిగారని తెలిపారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారని వెల్లడించారు. హత్యకు గురైన ఇంతియాజ్ హంద్రీనదిలో వైసీపీ కబ్జాలను బయట పెట్టారని చెప్పుకొచ్చారు. ఆది మనసులో పెట్టుకుని ఇంతియాజ్‌ను దారుణంగా హత్య చేశారని మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు కూడా చదవండి...
ఎల్‌నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారం: సీఎం చంద్రబాబు
అరాచకాలు, అక్రమాలు చేసే వైసీపీ కనుమరుగైపోయింది: మంత్రి డీబీవీ స్వామి
శ్రీశైల మల్లన్న భక్తులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత
Read Latest AP News And Telangana News And National News
And Telugu News