ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 14 నుంచి 16 వరకు వరుణ యాగాలు, జపాలు
ABN , Publish Date - Aug 11 , 2026 | 04:03 PM
లోకకల్యాణార్థం, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం దగ్గర త్రయాహ్నిక వరుణ యాగాలు, వరుణ జపాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపించనుంది.
విజయవాడ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): లోకకల్యాణార్థం, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం (Vijayawada Indrakeeladri Kanaka Durga Temple) దగ్గర త్రయాహ్నిక వరుణ యాగాలు, వరుణ జపాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపించనుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 14 వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనుంది. దుర్గాఘాట్, పాత యాగశాల వేదికలుగా మూడురోజుల పాటు విశేష హోమాలు, జపాలు, ఘటాభిషేకాలు జరగనున్నాయి.
వార్తలు కూడా చదవండి...
రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను అణిచివేస్తాం.. సీఎం వార్నింగ్
గుడ్‌న్యూస్.. పొగాకు రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణం
వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News