ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ABN , Publish Date - Aug 11 , 2026 | 03:03 PM
ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆక్వా రైతన్నలకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతులకు (Aqua Farmers) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) శుభవార్త తెలిపింది. ఆక్వా రైతన్నలకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నదాతలకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే అందించనుంది. ఈ మేరకు ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీపై ఈరోజు (మంగళవారం) ఎనర్జీ శాఖ జీవో ఆర్టీ నంబర్- 57 జారీ చేసింది. కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత కలిగిన అన్ని ఆక్వా ఫారాలకు రూ.1.50లకే యూనిట్ రాయితీని ఏపీ సర్కార్ కల్పించనుంది.
APSADA, CAA చట్టాల కింద రిజిస్టరైన అన్ని అర్హత కలిగిన ఆక్వా ఫారాలకు కూడా రూ.1.50లకే యూనిట్ విద్యుత్‌ను ఏపీ సర్కార్ అందించనుంది. సుమారు 6,500 రిజిస్టర్డ్ ఆక్వా ఫారాలకు ఈ రాయితీ వర్తించనుంది. భవిష్యత్తులో APSADA/CAA రిజిస్ట్రేషన్ పొందే అర్హత కలిగిన ఈ ఫారాలకు కూడా రిజిస్ట్రేషన్ తేదీ నుంచి రాయితీ కల్పించనుంది. 2026 జూన్ 1వ తేదీ నుంచి రూ.1.50లకే యూనిట్ రాయితీని అమలు చేయనుంది.
ఆక్వా ఉత్పత్తి వ్యయంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలకు ఏపీ సర్కార్ నిర్ణయంతో ఊరట కలిగింది. ప్రపంచ ఆక్వా ఎగుమతుల మార్కెట్‌లో పోటీ ధర, నాణ్యతతో నిలదొక్కుకునేందుకు ఈ విద్యుత్ రాయితీ అందించనుంది. ఆక్వా రైతుల వివరాలను మత్స్యశాఖ DISCOMలకు అందించనుంది. మత్స్యశాఖ ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం రాయితీ విస్తరణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
వార్తలు కూడా చదవండి...
రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను అణిచివేస్తాం.. సీఎం వార్నింగ్
గుడ్‌న్యూస్.. పొగాకు రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణం
వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News