Share News

నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం

ABN , Publish Date - Aug 12 , 2026 | 08:38 PM

ముంబై సినీ నటి కాదంబరీ జెత్వానీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా సీఐడీ కోర్టుకు కుక్కల విద్యాసాగర్ బుధవారం హాజరయ్యారు.

నటి కాదంబరీ  జెత్వానీ కేసులో కీలక పరిణామం
Kadambari Jethwani Case

విజయవాడ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ముంబై సినీ నటి కాదంబరీ జెత్వానీ కేసులో (Kadambari Jethwani Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా సీఐడీ కోర్టుకు కుక్కల విద్యాసాగర్ ఈరోజు (బుధవారం) హాజరయ్యారు. ఈ కేసులో జెత్వానీ సోదరుడు, తల్లిదండ్రులు పేర్లు తొలగించటంపై లిఖిత పూర్వకంగా తన అభ్యంతరాలను సీఐడీ కోర్టుకు విద్యాసాగర్ అందజేశారు. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి సీఐడీ కోర్టు వాయిదా వేసింది.


విద్యాసాగర్ అభ్యంతరాలిలా..

తనను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూల్ చేయటంతో జెత్వానీ తల్లిదండ్రులు, తమ్ముడి పాత్ర ఉందని కుక్కల విద్యాసాగర్ ఆరోపించారు. కొంత డబ్బును జెత్వానీ తల్లి ఆశా జెత్వానీ అకౌంట్‌కు బదిలీ చేశానని తెలిపారు. కొన్నిసార్లు జెత్వానీ తల్లి ఫోన్ చేసి తన కుమార్తె చెప్పినట్లుగా చేయాలని లేకపోతే ఇబ్బంది పడతావని బెదిరించిందని అన్నారు. దుబాయ్‌లో ఉన్న జెత్వానీ సోదరుడు అంబరీశ్‌కు నేరగాళ్లతో సంబంధం ఉందని, తనను బెదిరించారని చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురిని ఈ కేసు నుంచి తప్పించడానికి అనుమతించవద్దని కుక్కల విద్యాసాగర్ కోరారు.


వార్తలు కూడా చదవండి...

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 09:58 PM