Share News

మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారు.. జగన్‌పై మంత్రి సవిత ధ్వజం

ABN , Publish Date - May 31 , 2026 | 06:32 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు చంద్రబాబు వస్తే జాబు... జగనొస్తే చావేనని విమర్శించారు.

మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారు.. జగన్‌పై మంత్రి సవిత ధ్వజం
AP Minister Savitha

అమరావతి, మే31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత (AP Minister Savitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు చంద్రబాబు వస్తే జాబు... జగనొస్తే చావేనని విమర్శించారు. ఈరోజు (ఆదివారం) వెలగపూడిలోని సచివాలయంలో మీడియాతో మంత్రి సవిత మాట్లాడారు. మెగా డీఎస్సీలో అక్రమాలకు తావే లేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతల బిడ్డలు సైతం డీఎస్సీలో క్వాలిఫై అయ్యి టీచర్లగా పనిచేస్తున్నారని ప్రస్తావించారు.


ముఖ్యమంత్రిగా 2 లక్షలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుదని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. టీడీపీ మహానాడులో మహిళా రిజర్వేషన్ల ప్రకటనతో జగన్ మైండ్ బ్లాంక్ అయ్యిందని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీలో అక్రమాలంటూ జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి సవిత ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 31 , 2026 | 06:34 PM