జగన్ హయాంలో ఇరిగేషన్‌ను నిర్వీర్యం చేశారు.. మంత్రి నిమ్మల ధ్వజం
ABN , Publish Date - Sep 28 , 2026 | 09:42 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురై, విధ్వంసకరమైన నీటిపారదుల వ్యవస్థను సీఎం చంద్రబాబు నేడు గాడిలో పెట్టారని పేర్కొన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (AP Minister Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురై, విధ్వంసకరమైన నీటిపారదుల వ్యవస్థను సీఎం చంద్రబాబు నేడు గాడిలో పెట్టారని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) అమరావతి వేదికగా మంత్రి నిమ్మల మాట్లాడారు. కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులకు సంబంధించి రూ.160 కోట్ల బిల్లులను విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యదాలు తెలిపారు.
సీఎం చంద్రబాబు ఆలోచన సత్ఫలితాలను ఇస్తోంది..
జగన్ హయాంలో రద్దు చేసిన సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్ధరించి, రైతులకు చంద్రబాబు కొండంత భరోసా ఇచ్చారని మంత్రి నిమ్మల తెలిపారు. ఎల్‌నినో వంటి క్లిష్ట సమయంలో కూడా ఉన్న కొద్దిపాటి జలవనరులను సమర్దవంతంగా వినియోగించడంలో సాగునీటి సంఘాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాయని వివరించారు. రైతుల భాగస్వామ్యంతోనే సాగునీటి నిర్వహణ విజయవంతమవుతుందనే చంద్రబాబు ఆలోచన సత్ఫలితాలను ఇస్తోందని అన్నారు.
వైసీపీ పాలనలో గ్రీజు పెట్టడానికి కూడా నిధులు ఇవ్వలేదు..
వైసీపీ పాలనలో ఓఅండ్ఎం పనులకు కేవలం రూ. 200 కోట్లు మాత్రమే కేటాయించి, ఇరిగేషన్‌ను నిర్వీర్యం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. ఈ రెండేళ్లలోనే, కూటమి ప్రభుత్వం ఓఅండ్ఎం పనుల కోసం రూ.1320 కోట్లు మంజూరు చేసిందని ప్రస్తావించారు. గొడ్డలి పార్టీ హయాంలో కాలువల్లో పూడిక తీత, లాకులు, షట్టర్లు, రోప్‌ల మరమ్మతులకు గానీ, చివరకు గ్రీజు పెట్టడానికి కూడా నిధులు ఇవ్వలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
విశాఖలో మీడియా సమావేశం పెడతా.. ఆ విషయాలపై మాట్లాడతా: విజయసాయి రెడ్డి
శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారు: మంత్రి నిమ్మల
Read Latest AP News And Telangana News And National News
And Telugu News