Share News

రాప్తాడు ఘటన.. బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో విద్యార్థినిని పరామర్శించనున్న మంత్రి లోకేశ్

ABN , Publish Date - Oct 31 , 2026 | 09:37 PM

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు వెళ్లనున్నారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడులో ఉన్మాది దాడిలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

 రాప్తాడు ఘటన..  బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో విద్యార్థినిని పరామర్శించనున్న మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రేపు (ఆదివారం) మధ్యాహ్నం బెంగళూరు వెళ్లనున్నారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడులో ఉన్మాది దాడిలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ బాలికకు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో అందిస్తున్న చికిత్సపై మంత్రి లోకేశ్ వైద్యులతో చర్చించనున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరనున్నారు. అనంతరం చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మంత్రి లోకేశ్ ధైర్యం చెప్పనున్నారు.


కాగా, అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిని ఈరోజు (శనివారం) రంపంతో దుండగుడు దాడి చేశాడు. చెట్లు కోసే రంపం మిషన్‌తో మొహం, చేతులమీద కోసి పరారయ్యాడు. ఈ ఘటనలో బాలిక తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను హుటాహుటినా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్

స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 09:52 PM