మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Oct 30 , 2026 | 03:00 PM
తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలను అన్వేషించాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు.
అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలను అన్వేషించాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఆదేశించారు. ఈరోజు (శుక్రవారం) కాకినాడ జిల్లాపై ఆర్నబ్ తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలపై జిల్లా యంత్రాంగంతో, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు డిప్యూటీ సీఎం కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
మత్స్యకార గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తా..
వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మత్స్యకారుల సమస్యలపై స్వయంగా తాను అధ్యయనం చేస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: హోం మంత్రి అనిత
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News