Share News

హెరిటేజ్‌‌పై ఫేక్ ప్రచారం.. జగన్ అండ్ కో పై మంత్రి లోకేశ్ ధ్వజం

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:36 PM

రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హెరిటేజ్‌‌పై ఫేక్ ప్రచారం చేశారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందపూరు డెయిరీకి హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

హెరిటేజ్‌‌పై ఫేక్ ప్రచారం.. జగన్ అండ్ కో పై మంత్రి లోకేశ్ ధ్వజం
AP Minister NaraLokesh

అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హెరిటేజ్‌‌పై ఫేక్ ప్రచారం చేశారని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్(AP Minister NaraLokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందపూరు డెయిరీకి హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కానీ బొత్స ఇంద్రపూర్ డెయిరీ‌కి.. హెరిటేజ్ కో కంపెనీ అని అసత్య ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. అంత సీనియర్ నేతకు కో కంపెనీ అనే పదం ఉండదనే విషయం తెలియదా? అని నిలదీశారు. ఆయన ఇప్పటికైనా ఇందపూరు డెయిరీ హెరిటేజ్ కో ప్యాకర్ మాత్రమేనని తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు. హెరిటేజ్ లిస్టెడ్ కంపెనీ అని.. తమ మీద సెబీకి కూడా జగన్ అండ్ కో ఫిర్యాదు చేశారని ప్రస్తావించారు.


జగన్‌కి క్రికెట్ మ్యాచ్ టికెట్ కూడా తీసుకుంటా..

వాటికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఇచ్చారా? నిరూపించారా.? అని వైసీపీ నేతలపై మంత్రి లోకేశ్ ప్రశ్నల వర్షం కురిపించారు. కిలో నెయ్యి రూ.360లకు ఎక్కడ దొరుకుతుందో నిరుపించాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. కిలో రూ.360లకు దొరుకుతుంటే అది కల్తీ నెయ్యి మాత్రమే అవుతుందని చెప్పుకొచ్చారు. మామూలుగా మార్కెట్‌లో కిలో నెయ్యి రూ.1000ల పైన ఉందని తెలిపారు. జగన్‌మోహన్ రెడ్డి హయాంలోని ఐదేళ్లలో సాక్షి, భారతి సిమెంట్స్‌‌కు ప్రభుత్వం నుంచి రూ.1000 కోట్ల లబ్ధి పొందారని ఆరోపించారు. తాము ఇన్ని సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదని స్పష్టం చేశారు. క్రికెట్ మ్యాచ్‌లో ఇండియా ఫైనల్స్‌కు వెళ్తే ఆ మ్యాచ్ చూసేందుకు తప్పనిసరిగా వెళ్తానని తెలిపారు. అవసరమైతే జగన్ రెడ్డి వస్తానంటే ఆయనకు కూడా తానే టికెట్ తీసుకుంటానన్నారు.


సభను ఎందుకు అడ్డుకుంటారు..

శాసనమండలి సజావుగా జరగాలనుకున్న వైసీపీ సభ్యులు.. నాలుగు రోజులుగా ఎందుకు అడ్డుకుంటారని లోకేశ్ ప్రశ్నించారు. ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కావాలని శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడగటం ఏమిటని నిలదీశారు. ఈ విషయం శాసనమండలి సమావేశాలను అడ్డుకున్నప్పుడు వైసీపీ సభ్యులకు తెలియదా? అని నిలదీశారు.


ఎన్నికల్లో మెజారిటీ రావాలి..

తెలుగుదేశంలో జూనియర్లు, సీనియర్ల మధ్య పూర్తి సమన్వయం ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. టీడీపీలో తనతో సహా అందరూ నేతలకు కూడా ఎన్నికల్లో మెజారిటీ రావాలని సూచించారు. అప్పుడు మాత్రమే మనం పార్టీనీ సంస్థాగతంగా బలోపేతం చేసుకోగలమని దిశానిర్దేశం చేశారు. యువగళం సమయంలో తాను అందరినీ కలిసేవాడినని.. రెండేళ్ల గ్యాప్ వచ్చిందని ప్రస్తావించారు. అందుకే మళ్లీ నేతలు, వారి కుటుంబ సభ్యులతో భేటీ అవుతున్నానని తెలిపారు. అక్కడ అసలు రాజకీయాలు చర్చించడం లేదని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో తలసరి ఆదాయం భారీగా పెంపు: సీఎం చంద్రబాబు

ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 23 , 2026 | 04:53 PM