కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయండి: నారా లోకేశ్
ABN , Publish Date - Nov 28 , 2026 | 04:38 PM
రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను పార్టీ శ్రేణులు ప్రతిఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను పార్టీ శ్రేణులు ప్రతిఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ఆదేశించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. పట్టణ, పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసి కూటమి పార్టీల అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించారని తెలిపారు.
కూటమి పట్ల ప్రజలు ఎంతో సానుకూలంగా ఉన్నారు..
కూటమి పట్ల ప్రజలు ఎంతో సానుకూలంగా ఉన్నారని మంత్రి లోకేశ్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు. ప్రతి ఎన్నిక ముఖ్యమేనని... మీ పరిధిలోని ఆయా పోలింగ్ కేంద్రాల్లో క్రియాశీలకంగా వ్యవహారించాలని మార్గనిర్దేశం చేశారు. ఎన్నికల వ్యూహరచన పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. ప్రతి ఓటూ కీలకమేనని.. ప్రజలను ఎక్కడికక్కడ మొబిలైజ్ చేయాలని నిర్దేశించారు. రెబల్స్ విషయంలో స్థానిక నాయకత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.
కూటమి పార్టీల మధ్య వందశాతం ఓటు ట్రాన్స్‌ఫర్ జరిగేలా కృషిచేయాలని మంత్రి లోకేశ్ చెప్పారు. కూటమిలోని నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. బాగా పనిచేసిన నాయకులకు భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని మాటిచ్చారు. మొదటి దశ కంటే రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రావాలని మంత్రి లోకేశ్ దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అండ్ కో ఎగతాళి చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telangana NewsAnd National News
And Telugu News