Share News

జగన్ సిగ్గులేకుండా విరూపాక్షిని సమర్థిస్తున్నారు.. మంత్రి ధ్వజం

ABN , Publish Date - Aug 03 , 2026 | 03:06 PM

అమరావతి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన ఘోరాన్ని ఖండించకపోగా... జగన్ సిగ్గులేకుండా సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు.

 జగన్ సిగ్గులేకుండా విరూపాక్షిని సమర్థిస్తున్నారు.. మంత్రి ధ్వజం
AP Minister Kolusu Parthasarathy

అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి (AP Minister Kolusu Parthasarathy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన ఘోరాన్ని ఖండించకపోగా... జగన్ సిగ్గులేకుండా సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు. దళిత, బీసీ వర్గాలకు చెందిన మహిళ దుస్తులు చింపి, దుశ్శాసనుడిలా వైసీపీ ఎమ్మెల్యే ప్రవర్తించారని దుయ్యబట్టారు. ఈరోజు (సోమవారం) అమరావతి వేదికగా మీడియాతో కొలుసు పార్థసారథి మాట్లాడారు. గొడ్డలి పార్టీ అరాచకాలను గమనిస్తున్న ప్రజలు ఆ పార్టీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.


గొడ్డలి పార్టీ యువత జీవితాలను నాశనం చేస్తోంది..

సీఎం చంద్రబాబు యువత భవిష్యత్తు కోసం శ్రమిస్తుంటే గొడ్డలి పార్టీ వారి జీవితాలను నాశనం చేస్తోందని కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ప్రజాసేవ కాదని.. అరాచకాలు, నేరాలు చేయడమే గొడ్డలి పార్టీలో కొనసాగడానికి ముఖ్య అర్హత అని ఎద్దేవా చేశారు. ఎంత పెద్ద అరాచకాలు సృష్టిస్తే... జగన్ రెడ్డి దగ్గర అంత ప్రాధాన్యం లభిస్తుందని విమర్శించారు. నేరాలు చేసి దొరికిపోయాక ‘రాజకీయ కక్ష సాధింపు’ అంటూ సింపతీ డ్రామాలు ఆడటం వీరికి అలవాటేనని సెటైర్లు గుప్పించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్క అరాచక శక్తిని వదలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 45 ఏళ్లు దాటిన పేదవాడికి బతికే అర్హత లేదన్నట్లుగా జగన్ మాట్లాడారని ఆగ్రహించారు. శ్రీకాకుళంలో మహిళా పోలీసు మీద దుశ్శాసనుడి పర్వం కొనసాగించారని ధ్వజమెత్తారు.


యువకుడిని చచ్చేలా కొట్టారు..

బలహీన వర్గానికి చెందిన యువకుడిని చచ్చేలా కొట్టారని కొలుసు పార్థసారథి ఫైర్ అయ్యారు. ఆడకూతురిపై రాక్షస దాడికి తెగబడిన దుశ్శాసనుడిని... బాధితుడిగా చిత్రీకరించేందుకు గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కిడ్నాప్‌ చేసిన, మహిళలను, సీఎంను, హోంమంత్రిని అవమానించిన, అభ్యంతరకరంగా మాట్లాడిన గొడ్డలి పార్టీ అధినేత ఎందుకు ఖండించరని ప్రశ్నించారు. ప్రజలు వైసీపీని ఘోరంగా తిరస్కరించి గద్దె దించినా ఈ పార్టీ మూకలకు ఇంకా బుద్ధి రాలేదని హెచ్చరించారు. దళిత వర్గాలకు చెందిన మహిళల దుస్తులు చింపేంతటి నీచమైన సంస్కృతిని జగన్ రెడ్డి ఎందుకు ఖండించడం లేదు? అని మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు.


వార్తలు కూడా చదవండి...

కేంద్ర పన్నుల వాటాతో ఏపీ అభివృద్ధి మరింత వేగవంతం: సీఎం చంద్రబాబు

డ్రగ్స్ ర‌హిత ఏపీ కోసం కృషి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

పొగాకు రైతులకు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 03 , 2026 | 03:24 PM