Share News

అమరావతిలో వైసీపీ నేతలు రౌడీల్లాగా ప్రవర్తించారు.. మంత్రి అనగాని ధ్వజం

ABN , Publish Date - Jun 28 , 2026 | 09:53 AM

రాజధాని అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అమరావతి పర్యటన పేరుతో వైసీపీ నేతలు బజార్ రౌడీల స్థాయి కన్నా దిగజారి ప్రవర్తించారని ధ్వజమెత్తారు.

అమరావతిలో వైసీపీ నేతలు రౌడీల్లాగా ప్రవర్తించారు.. మంత్రి అనగాని ధ్వజం
AP Minister Anagani Satya Prasad

అమరావతి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ (AP Minister Anagani Satya Prasad) పేర్కొన్నారు. అమరావతి పర్యటన పేరుతో వైసీపీ నేతలు బజార్ రౌడీల స్థాయి కన్నా దిగజారి ప్రవర్తించారని ధ్వజమెత్తారు. రౌడీలు, గూండాలను వెంటవేసుకొచ్చి అమరావతి రైతులపై దాడులకు తెగబడ్డారని ఆగ్రహించారు. ఈరోజు(ఆదివారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు.


వైసీపీ కుట్రను భగ్నం చేశారు..

రాజధానిని మార్చేస్తామని అంటున్న వైసీపీకి.. రైతుల కోసం అంటూ అమరావతిలో పర్యటించే నైతిక హక్కు లేదని మంత్రి అనగాని తెలిపారు. కేవలం కొంతమంది రైతులను రెచ్చగొట్టి అమరావతి పనులు అడ్డుకునేందుకు, రైతుల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ ప్రయత్నించిందని మండిపడ్డారు. అమరావతి రాజధాని రైతులు కలిసికట్టుగా ప్రతిఘటించి వైసీపీ కుట్రను భగ్నం చేశారని చెప్పుకొచ్చారు. అమరావతికి అనుకూలమని ప్రకటించి, గతంలో ఇక్కడి రైతులపై చేసిన దాడులకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే వైసీపీ నేతలు పర్యటనకు రావాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తప్పు ఎవరు చేసినా తప్పే.. కులం ఆధారంగా చూడొద్దు: పవన్ కల్యాణ్

‘రాజధాని ద్రోహి జగన్, గో బ్యాక్’ అంటూ అమరావతి రైతుల నినాదాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 28 , 2026 | 09:58 AM