Share News

‘రాజధాని ద్రోహి జగన్, గో బ్యాక్’ అంటూ అమరావతి రైతుల నినాదాలు

ABN , Publish Date - Jun 27 , 2026 | 01:55 PM

అమరావతి ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం పెనుమాక సందర్శనకు వచ్చిన వైసీపీ నేతల బృందాన్ని ఉండవల్లి వద్ద రాజధాని రైతులు అడ్డుకున్నారు.

‘రాజధాని ద్రోహి జగన్, గో బ్యాక్’ అంటూ అమరావతి రైతుల నినాదాలు
Amaravati Farmers

అమరావతి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈరోజు(శనివారం) పెనుమాక సందర్శనకు వచ్చిన వైసీపీ నేతల బృందాన్ని ఉండవల్లి వద్ద రాజధాని రైతులు (Amaravati Farmers) అడ్డుకున్నారు. వాహనాలు ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘రాజధాని ద్రోహి జగన్, గో బ్యాక్’ అంటూ రైతులు నినాదాలు చేశారు. వైసీపీ నేతలు ఏ మొహం పెట్టుకుని రాజధానికి వస్తారని ప్రశ్నించారు. మావిగన్ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి వైసీపీ నేతల పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.


అమరావతిని రాజధానిగా అంగీకరించిన తర్వాతే పర్యటించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. రైతులను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజధాని రైతులు, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఇరువర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా, ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.


వైసీపీ శ్రేణులే కోడిగుడ్లతో దాడి చేశాయి: రాజధాని రైతులు

ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై వైసీపీ శ్రేణులే కోడిగుడ్లతో దాడి చేశాయని ఆరోపించారు. అలాగే వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉండవల్లి సెంటర్‌తో పాటు పెనుమాక, కృష్ణాయపాలెం ప్రాంతాల్లో కూడా రైతులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. అమరావతి రాజధాని అంశంపై తమ పోరాటం కొనసాగుతుందని రైతన్నలు స్పష్టం చేశారు.

మరోవైపు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉన్నప్పటికీ, అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రజాసేవే లక్ష్యం.. అమరావతిలో శరవేగంగా బసవతారకం ఆస్పత్రి నిర్మిస్తున్నాం: బాలకృష్ణ

వైసీపీ నేతలపై కేసులు.. మాజీ మంత్రి కాకాణి సహా పలువురిపై చర్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 27 , 2026 | 02:07 PM