వైసీపీ నేతలపై కేసులు.. మాజీ మంత్రి కాకాణి సహా పలువురిపై చర్యలు
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:27 PM
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయకుమార్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి సహా 17 మంది ఎమ్మెల్సీలు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.
నెల్లూరు జిల్లా, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు (Nellore YSRCP Leaders) నమోదు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయకుమార్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి సహా 17 మంది ఎమ్మెల్సీలు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. చిన్నబజారు పోలీసుస్టేషన్, బాలాజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ కేసులు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 189(2), 126(2), 285 r/wతో పాటు 190 యాక్ట్ కింద కేసులు బుక్ చేశారు.
ఇటీవల జిల్లాలోని పలు విద్యాసంస్థలతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి చెందిన కృష్ణచైతన్య విద్యాసంస్థల్లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తనిఖీలపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి స్పందించి.. మంత్రి నారాయణ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై వైసీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో వీఆర్సీ సెంటర్, చిల్డ్రన్స్ పార్క్ సెంటర్ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ఆందోళనలు నిర్వహించారని పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించారని తెలిపారు. అనుమతి లేకుండా నిరసనలు చేపట్టడం, ప్రజారవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించడం, జనజీవనాన్ని ప్రభావితం చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News