గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Jun 04 , 2026 | 10:06 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాక్షస పాలన విముక్తికి రెండేళ్లని చెప్పుకొచ్చారు. వెన్నుపోటుకు కాదని.. ప్రజా విముక్తికి ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
అమరావతి, జూన్4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (AP Minister Kinjarapu Achchennaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాక్షస పాలన విముక్తికి రెండేళ్లని చెప్పుకొచ్చారు. వెన్నుపోటుకు కాదని.. ప్రజా విముక్తికి ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ రాజకీయాలకు 2024లో ప్రజలు చరమగీతం పాడారన్నారు. ఈరోజు (గురువారం) వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు..
వైసీపీ నిరసనలు ప్రజల తీర్పును అవమానించే చర్యగా మంత్రి అచ్చెన్నాయుడు అభివర్ణించారు. జగన్ హయాంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ప్రజలు భయంతో జీవించారని అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కిన పార్టీ వైసీపీ అని ఆగ్రహించారు. ప్రజల్లో తిరగని జగన్.. ప్రజల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పరదాల చాటున పాలన చేసిన రోజులను ప్రజలు మరిచిపోలేదని చెప్పుకొచ్చారు. రైతులు, యువత, మహిళలను వైసీపీ మోసం చేసిందని మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు.
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు..
ప్రతీకార రాజకీయాలకు వైసీపీ పెట్టింది పేరని మంత్రి అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. పరిశ్రమలను తరిమేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని దుయ్యబట్టారు. ప్రజల తీర్పుతో వైసీపీ అహంకారానికి ముగింపు పలికారని చెప్పారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక వైసీపీ అబద్ధపు ప్రచారాలు చేస్తోందని ధ్వజమెత్తారు. సంక్షేమం పేరుతో వైసీపీ మోసపూరిత పాలన చేసిందని ఆరోపించారు. ప్రజావ్యతిరేక పాలనకు 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక ముగింపు పలికారని తెలిపారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు
యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి: కోటంరెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News