స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక ప్రకటన.. ప్రభుత్వం గెజిట్ ఇస్తేనే ఎన్నికల నోటిఫికేషన్
ABN , Publish Date - Oct 09 , 2026 | 03:45 PM
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే, ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.
అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై (AP Local Body Elections) రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే, ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ( శుక్రవారం) మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ‘సర్’ ప్రక్రియ తర్వాత చేపట్టిన ఓటర్ల జాబితానే పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రస్తుత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లు ఖరారైతే రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఆ తర్వాతే స్థానిక నోటిఫికేషన్ ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనల ఆధారంగా ఈ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉంటామని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
కాగా, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్ ప్రక్రియ తరువాతే స్థానిక ఎన్నికలు జరపాలనే వైసీపీ వాదనను తోసిపుచ్చింది. ఎన్నికలకు ఆటంకం కలిగించడమంటే ప్రజాప్రయోజనాలను అడ్డుకోవడమేనని పేర్కొంది. ఈ విషయమై వైసీపీ వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్‌ను మరింత ఉన్నతస్థాయికి మోదీ తీసుకెళ్తున్నారు: లోకేశ్
భోగాపురంతో ఉత్తరాంధ్ర మినీ ఎకనామిక్ సిటీగా మారుతుంది: రామ్మోహన్
హరితాంధ్రప్రదేశ్ నిర్మాణానికి రైతుల భాగస్వామ్యం కీలకం: నాగబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News