ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. డెయిరీ, పశుసంవర్థక ఫారాలకు భారీ ఊరట
ABN , Publish Date - Mar 21 , 2026 | 05:14 PM
పశుసంవర్థక రంగానికి ఏపీ సర్కార్ భారీ ఊరట కల్పించింది. పట్టణాల్లో పశుపోషకులకు అభివృద్ధి ఛార్జీల నుంచి మినహాయింపు నిచ్చింది. భవన అనుమతుల రుసుములో సడలింపులు చేసింది.
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): పశుసంవర్థక రంగానికి ఏపీ సర్కార్ (AP Govt) భారీ ఊరట కల్పించింది. పట్టణాల్లో పశుపోషకులకు అభివృద్ధి ఛార్జీల నుంచి మినహాయింపు నిచ్చింది. భవన అనుమతుల రుసుములో సర్కార్ సడలింపులు చేసింది. ఈ సందర్భంగా అమరావతిలోని సచివాలయంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఈరోజు(శనివారం) మాట్లాడారు. రాష్ట్రంలో పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తూ పశుపోషకులు, చిన్నరైతులకు పెద్దఎత్తున ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఏపీలోని పట్టణ స్థానిక సంస్థలు, పట్టణ అభివృద్ధి సంస్థలు పరిధిలో డెయిరీ ఫారాలు, గొర్రెలు/మేకల పెంపకం కేంద్రాలు, పందుల పెంపకం యూనిట్లు, ఇతర పశుసంవర్థక ఫారాలకు బెటర్‌మెంట్, డెవెలప్‌మెంట్ చార్జీలు మినహాయింపు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ ఫారాలకు భవన అనుమతి/లైసెన్స్ రుసుమును గ్రామ పంచాయతీల్లో వసూలు చేసే రుసుముకు సమానంగా నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ నిర్ణయం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పశుపోషణపై ఆధారపడిన రైతులు, చిన్న వ్యవసాయదారులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. దీంతో మరింత మందికి స్వయం ఉపాధి, సంవృద్ధి లభిస్తుందని వెల్లడించారు. గత జూన్‌లో జరిగిన సీఎం కాంక్లేవ్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News