జగన్ హయాంలో చేసిన విధ్వంసంతో ఏపీ బ్రాండ్‌ను కోల్పోయాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 19 , 2026 | 01:07 PM
స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు.
అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగమని వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి ఎవరూ అతీతులు కాదని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చరిత్ర సృష్టించారని పునరుద్ఘాటించారు. 2024 ఎన్నికల్లో 94శాతం స్ట్రైక్ రేట్, 57శాతం ఓట్ షేర్ ఇచ్చారని తెలిపారు. వైసీపీ అరాచక పాలన, విధ్వంసంపై ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
ఏ ఒక్కరోజునూ వృథా చేయలేదు..
2024 ఎన్నికల తర్వాత ఏ ఒక్కరోజునూ తాము వృథా చేయలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టిపెట్టామని వెల్లడించారు. ప్రతి వ్యక్తికి, కుటుంబానికి భద్రత కల్పించామని చెప్పుకొచ్చారు. వృద్ధులకు పెన్షన్ రూ.4 వేలు ఇచ్చి ఆర్థిక భద్రత కల్పించామని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని పునరుద్ఘాటించారు. ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చదువుకునేందుకు డబ్బులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ కూడా ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజల నమ్మకాన్ని తమ ప్రభుత్వం వమ్ము చేయలేదని అన్నారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం..
ఎన్ని సవాళ్లు ఉన్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సూపర్ సిక్స్‌ను యథావిథిగా అమలు చేశామని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. గోతులమయమైన రహదారులను సరిచేస్తున్నామని అన్నారు. తాగునీటి సౌకర్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అధికారులను ఆదేశించారు. జగన్ హయాంలో చేసిన విధ్వంసంతో ఏపీ బ్రాండ్‌ను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని తెలిపారు. మెగా డీఎస్సీపై వైసీపీ ఎన్నో కుట్రలు చేసిందని ధ్వజమెత్తారు. డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లను జగన్ అండ్ కో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారని ఆగ్రహించారు. రాయలసీమలో ఎన్నో ప్రాజెక్టులు తీసుకువస్తున్నామని వివరించారు. నాటి రాళ్లసీమ.. నేటి రతనాలసీమ అని పేర్కొన్నారు. రాయలసీమ రైజింగ్ అని ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి ప్రజలను దారి మళ్లించి రాయలసీమను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఆయా ప్రాజెక్టులను నిర్మించి రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తున్నామని చెప్పారు. జొన్నగిరిను స్వర్ణగిరిగా మార్చడం అందరికీ తెలుసునని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం..
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సేవలు, ఎలా ఉన్నాయో కూడా రియల్ టైమ్ ద్వారా తెలుసుకుంటున్నామని తెలిపారు. పాలనలో జవాబుదారీతనం తీసుకువస్తున్నామని చెప్పారు. ఎల్‌నినో కారణంగా ఎదురైన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటున్నామని అన్నారు. రాబోయే రెండేళ్లలో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిజం నిప్పులాంటిదని.. దానితో ఆడుకుంటే మసి కాకతప్పదని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు ఇచ్చామని.. భోగాపురం ఎయిర్ పోర్టును ప్రారంభించామని అన్నారు.
జగన్ హయాంలో అమరావతిని విధ్వంసం చేశారు..
వెలుగొండకు తానే శంకుస్థాపన చేశానని.. మళ్లీ ఫేస్-1ను తానే ప్రారంభించానని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పోలవరం వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జాతికి అంకితం చేస్తామని వివరించారు. గోదావరి, కావేరి అనుసంధానం చేస్తే నీటి సమస్యలు తీరుతాయన్నారు. జగన్ హయాంలో అమరావతిని విధ్వంసం చేశారని... త్యాగాలు చేసిన రైతులను అవమానించారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో మూడు రాజధానులు, విజయవాడ అన్నారని.. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తున్నామని పునరుద్ఘాటించారు. అమరావతి పనులపై ఎవరికైనా సందేహం ఉంటే వచ్చి పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా.. రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు
వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత
ఉత్సవ్ ద్వారా ఎంపీ శివనాథ్ విజయవాడకు ఓ బ్రాండ్ తెచ్చారు: పెమ్మసాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News