Share News

దేశ నిర్మాణంలో అడ్వాణీ సేవలు వెలకట్టలేనివి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 08 , 2026 | 09:23 AM

భారతరత్న ఎల్కే అడ్వాణీకి 100వ జన్మదిన శుభాకాంక్షలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశ నిర్మాణంలో అడ్వాణీ సేవలు వెలకట్టలేనివి అని కొనియాడారు.

దేశ నిర్మాణంలో అడ్వాణీ సేవలు వెలకట్టలేనివి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): భారతరత్న ఎల్కే అడ్వాణీకి (LK Advani) 100వ జన్మదిన శుభాకాంక్షలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తెలిపారు. దేశ నిర్మాణంలో ఆయన సేవలు వెలకట్టలేనివి అని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు పెట్టారు. దశాబ్దాల పాటు అడ్వాణీ చేసిన ప్రజాసేవ తరతరాలకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.


స్వతంత్ర భారత తొలితరం నాయకుడిగా దేశ ప్రగతిలో అడ్వాణీ కీలక పాత్ర పోషించారని సీఎం వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రభుత్వంలో ఆయనతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అడ్వాణీ ఆయురారోగ్యాలతో, సంతోషంగా వర్ధిల్లాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 10:16 AM