Share News

డీఎస్సీపై జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారు.. మంత్రి కొండపల్లి ధ్వజం

ABN , Publish Date - Jun 06 , 2026 | 08:00 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

డీఎస్సీపై జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారు.. మంత్రి కొండపల్లి ధ్వజం
AP Minister Kondapalli Srinivas

అంబేద్కర్ కోనసీమ జిల్లా, జూన్6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (AP Minister Kondapalli Srinivas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీఎస్సీపై రాజకీయం చేసి ఎక్కడో తప్పు జరిగినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఈరోజు (శనివారం) అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లితో పాటు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. 82 మందికి రూ.4.86 కోట్ల విలువ చేసే ఎంఎస్ఎం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. తమ ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు.


డీఎస్సీపై ఆరోపణలు చేసిన వారిపై అధికారులు విశ్లేషణ చేశారని.. కొంతమందికి ఎందుకు ఉద్యోగం రాలేదో వివరించారని అన్నారు. వైసీపీ నేతలు తప్పుడం సందేహాలు క్రియేట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌కు ఐదేళ్ల సమయం ప్రజలు ఇచ్చారని.. వారి హయాంలో జనం కోసం ఏమి చేయలేకపోయారని మండిపడ్డారు. బటన్ నొక్కితే చాలనే ఆలోచనతోనే జగన్ పని చేశారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంలో రెండేళ్లలో జరిగిన అభివృద్ధి.. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు

గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు

Read Latest AP News And Telangana News  And National News

And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 08:04 PM