వైసీపీ నేత చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, మరో ఇద్దరికి హైకోర్టులో షాక్
ABN , Publish Date - Nov 06 , 2026 | 08:28 PM
వైసీపీ నేత చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, మరో ఇద్దరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తిరుపతి రూరల్‌లోని చంద్రగిరి, పాకాల మండల పరిధిలోని పలు వార్డుల్లో రీ పోలింగ్ నిర్వహించాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియను వాయిదా వేయాలని హైకోర్టులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి (Chevireddy Harshit Reddy), మరో ఇద్దరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో(AP High Court) షాక్ తగిలింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తిరుపతి రూరల్‌లోని చంద్రగిరి, పాకాల మండల పరిధిలోని పలు వార్డుల్లో రీ పోలింగ్ నిర్వహించాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియను వాయిదా వేయాలని న్యాయస్థానంలో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఈరోజు(శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది.
తిరుపతి రూరల్, చంద్రగిరి, పాకాల మండలాల్లో పోలింగ్‌లో అక్రమాలు జరిగినట్లు కలెక్టర్ నుంచి నివేదిక రాలేదని ఎన్నికల కమిషన్ తరుపున న్యాయవాది అశ్వని కుమార్ న్యాయస్థానానికి వివరించారు. ఇలాంటప్పుడు అక్కడ రీ పోలింగ్‌కు ఆదేశాలు ఇవ్వలేమని అశ్వని కుమార్ పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం రీ పోలింగ్‌కు ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటింగ్ ప్రక్రియను కూడా నిలువరించలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టులో కీలక విచారణ
ప్రాణాలకు తెగించి పోలీసుల రెస్క్యూ ఆపరేషన్.. హోం మంత్రి అనిత ప్రశంసలు
కడప, పులివెందులలో జగన్ అరాచకాలు, దౌర్జన్యాలతో ఓటర్లను భయపెడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News