శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం
ABN , Publish Date - Jun 28 , 2026 | 06:38 AM
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబానీ, అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
తిరుమల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ (Anant Ambani) తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబానీ, అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆయనకు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసి సత్కరించారు.

రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులు..
తిరుమల పర్యటన సందర్భంగా అనంత్ అంబానీ టీటీడీకి భారీ విరాళం ప్రకటించడం విశేషంగా నిలిచింది. తిరుమల రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా ఇచ్చేందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఈ బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు ఇస్తామని అనంత్ అంబానీ చెప్పారు. బస్సు డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థ నుంచే ఇస్తామని టీటీడీకి వివరించారు.
వంతారా మాదిరిగా టీటీడీ గోశాల ఆధునికీకరణ..
గుజరాత్ వంతారాలో ఉన్నట్లుగా టీటీడీ గోశాలను ఆధునికీకరించడానికి ఆయన అంగీకరించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో పూజలు చేసిన అనంత్ అంబానీ, దేశ ప్రజల సంక్షేమం, శాంతి, సుభిక్షం కోసం ప్రత్యేకంగా ప్రార్థించారు. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చిన భక్తులు అనంత్ అంబానీని చూసేందుకు ఆసక్తి చూపించారు. ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయన పర్యటన ప్రశాంతంగా సాగింది. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు అనంత్ అంబానీతో కాసేపు సమావేశమై టీటీడీ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
తప్పు ఎవరు చేసినా తప్పే.. కులం ఆధారంగా చూడొద్దు: పవన్ కల్యాణ్
‘రాజధాని ద్రోహి జగన్, గో బ్యాక్’ అంటూ అమరావతి రైతుల నినాదాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News