Share News

Kandikunta: మత ప్రచారాలను ప్రోత్సహిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఎమ్మెల్యే కందికుంట ఫైర్

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:13 AM

రాష్ట్రం, దేశంలో హిందుత్వాన్ని అణగతొక్కాలని జగన్ కుట్ర చేస్తున్నారని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ అండ్ కో.. హిందూ ధార్మిక సంస్థలపై దాడికి కుట్ర చేస్తూ అలజడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..

Kandikunta: మత ప్రచారాలను ప్రోత్సహిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఎమ్మెల్యే కందికుంట ఫైర్
Kadiri MLA Kandikunta Venkata Prasad

శ్రీ సత్యసాయి జిల్లా, జనవరి11(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ (Kadiri MLA Kandikunta Venkata Prasad) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై కుట్రలకు జగన్ అండ్ కో తెరదీశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో మత ప్రచారాలను ప్రోత్సహించారని ధ్వజమెత్తారు. కదిరిలో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మీడియాతో మాట్లాడారు.


కుట్ర చేస్తున్నారు..

హిందూ ధార్మిక సంస్థలపై.. జగన్ అండ్ కో దాడికి కుట్ర చేస్తూ అలజడికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆరోపించారు. తిరుమలకు వాళ్లే బండిలో వెళ్లి అక్కడ మద్యం సీసాలు పెడతారని.. చివరకు వారే అల్లరి చేస్తారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో, దేశంలో హిందుత్వాన్ని అణగదొక్కాలని జగన్ కుట్ర చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. సమాజంలో ఉన్న అన్నివర్గాల ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన, ధోరణి కూటమి ప్రభుత్వానిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నెల్లూరు ఓఆర్ఆర్‌పై మంత్రి నారాయణ క్లారిటీ..

స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలు సాధించాలి: మంత్రి సత్యకుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 11 , 2026 | 11:34 AM