Minister Satya Kumar Yadav: స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలు సాధించాలి: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Jan 11 , 2026 | 10:26 AM
దేశ, రాష్ట్ర అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక యువతకు పెద్ద పీట వేస్తూ అన్నిరంగాల్లో వారిని ప్రోత్సహిస్తూ రాణించేలా సహకారం అందిస్తున్నారని కొనియాడారు..
విజయవాడ, జనవరి11(ఆంధ్రజ్యోతి): స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుని.. తమ లక్ష్యాలను సాకారం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) సూచించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యూత్ మారథాన్ నిర్వహించామని తెలిపారు. వివేకానంద ఏ విలువల కోసం జీవించారో.. అంతా వాటిని ఆదర్శంగా తీసుకుని పాటించాలని మార్గనిర్దేశం చేశారు. ముఖ్యంగా యువత.. ఆయన చరిత్ర తెలుసుకొని ఆ విలువలను కొనసాగించాలని సూచించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పాశ్చాత్య దేశాల్లో ఆ రోజుల్లోనే ప్రదర్శించిన మహనీయుడు.. వివేకానంద అని ప్రశంసించారు మంత్రి సత్యకుమార్.
యువత ఉక్కు సంకల్పంతో ముందుకు సాగాలి..
బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం రాఘవయ్య పార్క్ నుంచి నిర్వహించిన యూత్ మారథాన్ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ మారథాన్‌లో యువత కాషాయ రంగు షర్టులు ధరించారు. వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రసంగించారు. మన జాతి నిర్మాణంలో యువత పోషించాల్సిన పాత్ర గురించి వివేకానంద అనేక సందర్భాల్లో చెప్పేవారని తెలిపారు. యువత ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తూ.. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించే వారని చెప్పుకొచ్చారు. యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మంత్రి సత్య కుమార్.
యువత కీలకం..
ఎలాంటి అడ్డంకులు వచ్చినా.. వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలని వివేకానంద చెప్పేవారని మంత్రి సత్య కుమార్ ప్రస్తావించారు. దేశ నిర్మాణం, జాతి నిర్మాణం చేయాలంటే యువత కీలకంగా వ్యవహరించాలని దిశనిర్దేశం చేశారు. అందుకు అణుగుణంగానే నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అంశాల్లో యువతను భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టాయని వివరించారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక యువతకు పెద్దపీట వేస్తూ, అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహిస్తూ రాణించేలా సహకారం అందిస్తున్నారని కొనియాడారు. యువతలో ఉన్న మేథోశక్తిని బయటకు తీస్తూ వారికి మంచి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాల్లో మన యువత ముందుండేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని వెల్లడించారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం..
దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News