Share News

జగన్.. వైఎస్సార్ పేరు చెడగొడుతున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:15 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్.. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేరు చెడగొడుతున్నారని ధ్వజమెత్తారు.

జగన్..  వైఎస్సార్ పేరు చెడగొడుతున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం
JC Prabhakar Reddy

అనంతపురం జిల్లా, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్.. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేరు చెడగొడుతున్నారని ధ్వజమెత్తారు. మళ్లీ అధికారంలోకి వైసీపీ వస్తే రప్పా రప్పా నరికేస్తామని తమను బెదిరిస్తారా..??? అని దుయ్యబట్టారు. ఫ్యాక్షన్ రూపుమాపాలని తాను అనుకుంటున్నానని అన్నారు. ఇవాళ కూటమి సర్కార్‌లో తాడిపత్రి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందే వైసీపీ, ఆ పార్టీ నాయకులని ఆగ్రహించారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిపై మండిపడ్డారు. ఆయన రాబోయే ఎన్నికల్లో నిలబడితే ప్రజలు కొడతారని హెచ్చరించారు. వైసీపీ హయాంలో దౌర్జన్యాలకు పోటీ చేయొద్దని చంద్రబాబు తనకు చెప్పినా... అప్పుడు తాను ఎదుర్కొని పోటీ చేశానని ప్రస్తావించారు.


రమేశ్ గౌడ్ పార్టీ మారాలి..

ఇవాళ వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహించారు. ప్రజాస్వామ్యం లేకపోతే సింగనమలలో రెండు జడ్పీటీసీలు ఎలా వచ్చాయో..? శైలజానాథ్ చెప్పాలని ప్రశ్నించారు. తమిళనాడు నుంచి బస్సుల్లో దొంగ ఓటర్లను తీసుకువచ్చి కుప్పంలో ఓట్లు వేయించుకుని గెలిచారని... ఆరోజు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా..? అని నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురించి మాట్లాడటం కూడా వృథానే అని విమర్శించారు. 2021 ఎన్నికల అప్పుడు పోలీసులు చేసిన విధంగా ఇవాళ చేసి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవని చెప్పుకొచ్చారు. ఆయా జిల్లాల్లో ఇటు పరిటాల కుటుంబం... అటు తోపుదుర్తి ఫ్యామిలీ మాత్రమే పోరాటం చేస్తూ... రాజకీయాలు చేస్తున్నాయని వెల్లడించారు. అనంతపురం మేయర్‌గా గెలిచిన రమేశ్ గౌడ్ పార్టీ మారితే బాగుంటుందని హితవు పలికారు. అనంతపురం అభివృద్ధి జరగాలంటే మేయర్ రమేశ్ గౌడ్ పార్టీ మారాలని సూచించారు.


వైసీపీ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడవద్దు..

మేయర్ రమేశ్ గౌడ్‌కు కమిషనర్, అధికారులు మాట వినరని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. వైసీపీ హయాంలో తాను మున్సిపల్ ఛైర్మన్‌గా గెలిచినప్పుడు తాడిపత్రిలో అధికారులు ఎవరూ తన మాట వినలేదని గుర్తుచేశారు. వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే... ప్రజలు వారి ఇళ్ల ముందుకు వచ్చి నిలదీస్తారని అన్నారు. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇవాల్టి నుంచి ప్రజాస్వామ్యం గురించి వైసీపీ నేతలు మాట్లాడవద్దని అన్నారు. అనంతపురం పట్టణం మేలు కోరితే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో గెలిచిన తమ 14 మంది ఎమ్మెల్యేలను రిజైన్ చేయమని వైసీపీ నేతలు అడుగుతున్నారని చెప్పారు. కానీ ముందుగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి... వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేశారు.


కూటమి ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ..

కూటమి ప్రభుత్వంలో యల్లనూరు, పుట్లూరు మండలాల్లో ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాను ఆయా గ్రామాల్లో తిరుగుతానని చెప్పారు. అనంతపురం నగరం అభివృద్ధి చెందాలంటే... వైసీపీ మేయర్‌తో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులందరూ.. తమ మంత్రులను, ఇన్‌చార్జ్‌ మంత్రి, ఎమ్మెల్యేలను కలవాలని.. లేదంటే నిధులు రావని తెలిపారు. అనంతపురం జిల్లా ఎస్పీ వైసీపీ వైపే ఉన్నారని.. తమ ప్రభుత్వం వైపు ఎందుకు లేరని ప్రశ్నించారు. జిల్లాకు మంచి చేస్తారని ఈ ఎస్పీని తాను నమ్మానని.. కానీ తనకు చెడ్డ పేరు తెచ్చిందే ఆయనే అని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీ ఎండీసీకి రూ.115 కోట్ల గ్యారెంటీ మంజూరు

స్థానిక ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.. మంత్రి ఆనం ధ్వజం

సహకార సంఘాల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు..!

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 01:08 PM