Share News

KTR ON Ring Road Statement: రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌‌పై కేటీఆర్ ఏమన్నారంటే...

ABN , Publish Date - Sep 18 , 2025 | 02:56 PM

రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌‌పై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు మారుస్తోందని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

KTR ON Ring Road Statement: రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌‌పై కేటీఆర్ ఏమన్నారంటే...
KTR ON Ring Road Statement

వికారాబాద్ జిల్లా, సెప్టెంబరు18 (ఆంధ్రజ్యోతి): రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌‌పై (Regional Ring Road Alignment) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) స్పందించారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు మారుస్తోందని ప్రశ్నల వర్షం కురిపించారు. అలైన్‌మెంట్‌ను మార్చి రోడ్డు నిర్మాణం చేపడితే మరో లగచర్ల ఘటన ( Lagacharla incident) రిపీట్ అవుతుందని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను హెచ్చరించారు కేటీఆర్. గతంలో ఆమోదించిన రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం అలైన్‌మెంట్‌ని మార్చి సర్వే నెంబర్లను ప్రకటించింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Govt).


అయితే, గతంలో నిర్మించ తలపెట్టిన మార్గంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉండటంతో అలైన్‌మెంట్‌‌ను మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలైన్‌మెంట్‌ మార్పుతో రైతులు (Farmers) భారీగా భూములు కోల్పోతున్నారు. ఈ విషయంపై వారం రోజులుగా వివిధ పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేశారు అన్నదాతలు. అధికారులు తమను పట్టించుకోవడం లేదని కేటీఆర్‌ను కలిశారు మోమీన్‌పేట మండల గ్రామాల రైతులు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో ఫోన్‌లో మాట్లాడారు కేటీఆర్. పేద రైతుల భూములను గుంజుకొని వారికి అన్యాయం చేస్తే మరో లగచర్ల ఘటన చోటు చేసుకుంటుందని కలెక్టర్‌ను హెచ్చరించారు కేటీఆర్. అయితే, కలెక్టర్‌ను హెచ్చరించిన వీడియో వికారాబాద్ జిల్లా వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రంగుమారిన పొలాలు.. ఆందోళనలో రైతులు

రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 03:09 PM