Share News

Hyderabad Raids: ఓ వైపు ఐటీ.. మరోవైపు ఈడీ.. హైదరాబాద్‌లో వరుస సోదాలు

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:33 PM

క్యాప్స్ గోల్డ్ కంపెనీ డైరెక్టర్ చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చందా కుటుంబ సభ్యులు, డైరెక్టర్లుగా ఉన్న పలు కంపెనీల్లో కీలక ఆధారాలను ఐటీ అధికారులు సేకరించారు.

Hyderabad Raids: ఓ వైపు ఐటీ.. మరోవైపు ఈడీ.. హైదరాబాద్‌లో వరుస సోదాలు
Hyderabad Raids

హైదరాబాద్, సెప్టెంబర్ 18: నగరంలో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి. వాసవి గ్రూప్ తోపాటు, కలాసా జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ సంస్థలు ఐదేళ్లలో చెల్లించిన పన్నులపై అధికారు ఆరా తీస్తున్నారు. క్యాప్స్ గోల్డ్ కంపెనీ డైరెక్టర్ చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చందా కుటుంబ సభ్యులు, డైరెక్టర్లుగా ఉన్న పలు కంపెనీల్లో కీలక ఆధారాలను ఐటీ అధికారులు సేకరించారు.


హైదరాబాద్‌తో పాటు వరంగల్లోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయి. చందా శ్రీనివాసరావుతో పాటు, చందా అభిషేక్, చందా సుధీర్ నివాసాల్లోను ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. అటు వాసవి బిల్డర్స్‌పై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి వాసవి ఆఫీస్, వాసవి చైర్మెన్ విజయ్ కుమార్ యర్రం ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. రాత్రి అంతా వాసవి ఆఫీస్‌లోనే ఐటీ అధికారులు ఉండి మరీ సోదాలు నిర్వహించారు.


ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం

ed.jpg

మరోవైపు సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడుపల్లిలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వెల్డింగ్టన్ ఎంక్లేవ్‌లో ఉన్న వ్యాపారవేత్త బూరుగు రమేష్, అతని కుమారుడు విక్రాంత్ నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాల్లో పలు కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహాదేవ జ్యూవెలర్స్‌తో పాటు రాజశ్రీ ఫుడ్స్‌లో బూరుగు విక్రాంత్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. మహాదేవ జ్యూవెలర్స్‌లో బంగారం కొనుగోలు, అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. మహాదేవ్ జ్యూవెలర్స్ తోపాటు మరికొన్ని కంపనీలకు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు విక్రాంత్. ఈ క్రమంలో మనీ లాండరింగ్ , ఫెమా నిబంధనలు ఉల్లగించినట్లు ఈడీ గుర్తించింది. ఈరోజు రాత్రి వరకు ఈడీ సోదాలు కొనసాగనున్నాయి.


ఇవి కూడా చదవండి..

రంగుమారిన పొలాలు.. ఆందోళనలో రైతులు

రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 12:36 PM