Sabitha Reddy: కేసీఆర్ హయాంలోనే విద్య, వైద్యానికి పెద్దపీట
ABN , Publish Date - Sep 18 , 2025 | 10:19 AM
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట్, పహాడిషరీఫ్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆమె పరిశీలించారు.
- మాజీమంత్రి సబితారెడ్డి
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి(Maheshwaram MLA P. Sabitha Indra Reddy) అన్నారు. బుధవారం జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట్, పహాడిషరీఫ్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆమె పరిశీలించారు. ఎర్ర కుంట, జల్‌పల్లి, కమాన్‌వద్ద అర్బన్ హెల్త్‌పోస్ట్ ఆస్పత్రికి స్థలాలను పరిశీలించారు. ఈసందర్భంగా సబితా ఇంద్రారెడ్డి, మాట్లాడుతూ, పాఠశాలలో నెల కొన్న సమస్యలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. మన ఊరు మన బడి ద్వార ప్రభుత్వం పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. మైనార్టీల కోసం 200మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశారన్నా రు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించక పోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించిన తర్వాతనే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పడంతో చాలా మంది విద్యార్థులు పై చదువులకు వెళ్లలేక పోతున్నారన్నారు.
- గతంలో ఆరోగ్య శ్రీ ద్వారా పేదప్రజలకు వైద్యం అందిచడం జరిగిందని, ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు పైవ్రేట్ ఆస్పపుత్రుల యజమానులు ప్రకటించారన్నారు. పేద ప్రజలకు సంబంధించిన అన్ని పథకాలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం పూనుకుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే
Read Latest Telangana News and National News