Road Accident: ఆయిల్ ట్యాంకర్ ఢీ.. మహిళ మృతి
ABN , Publish Date - Sep 18 , 2025 | 02:44 PM
సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న మహిళపైకి ఆయిల్ ట్యాంకర్ వేగంగా దూసుకువెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
సంగారెడ్డి, సెప్టెంబర్ 18: సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి దాటుతున్న ఒక మహిళను భారీ ఆయిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో సదరు మహిళ ఆయిల్ ట్యాంకర్ టైర్ల కింద పడి.. ఆమె మృతదేహం నుజ్జు నుజ్జు అయింది. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. ముక్కలైన ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మృతురాలును గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.