Kishan Reddy: ఏం చేశారని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఫైర్
ABN , Publish Date - Dec 06 , 2025 | 08:40 PM
కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. భూములు అమ్మి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని విమర్శించారు.
యాదాద్రి, డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు ఎందుకోసం నిర్వహిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. ప్రజాతీర్పును వంచించినందుకు ఈ విజయోత్సవాలు జరుపుతున్నారా? అని నిలదీశారు. ఇవాళ(శనివారం) భువనగిరిలో కిషన్‌రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కిషన్‌రెడ్డి. కల్యాణ లక్ష్మిలో భాగంగా తులం బంగారం ఇవ్వనందుకా..?… మహిళలకు రూ. 2500 ఇవ్వనందుకా..? ప్రజాపాలన విజయోత్సవాలు అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపణలు చేశారు. భూములు అమ్మి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని విమర్శించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్‌ను భూములు అమ్మే ఇస్తున్నారని ఆక్షేపించారు. ఎన్టీపీసీ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. రీజనల్ రింగ్ రోడ్డు 50 శాతం పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుందని ప్రస్తావించారు.
కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్‌ను సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తామని ప్రకటించారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని వచ్చే ఏడాదిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. కాగా, ఆఫ్రికా దేశంలోని మాలిలో కిడ్నాప్‌నకు గురైన తన కుమారుడును సురక్షితంగా తీసుకురావాలని కిషన్‌రెడ్డికి నల్లమాస ప్రవీణ్ గౌడ్ తండ్రి జంగయ్య వినతిపత్రం అందజేశారు. సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్రం తరఫున అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు కిషన్‌రెడ్డి.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం
గాంధీ, నెహ్రూలపై బీజేపీ విష ప్రచారం.. జగ్గారెడ్డి ఫైర్
Read Latest Telangana News and National News