Mahesh Goud: మెట్రోఫేస్-2ని అడ్డుకుంటుంది కిషన్‌రెడ్డినే.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:10 PM
హైదరాబాద్ మెట్రో ఫేస్-2 విస్తరణకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు. సబర్మతి నిరాశ్రయులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు.
ఢిల్లీ, అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ఫేస్-2 విస్తరణ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అడ్డంకిగా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. మెట్రో పనులు చేపట్టేలా ఆయన ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు. ఇవాళ(ఆదివారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేశారు. కిషన్‌రెడ్డి మెట్రో కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు. మెట్రోఫేస్-2ని అడ్డుకుంటుంది కిషన్‌రెడ్డినేనని ఆరోపించారు. కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకుని మెట్రోఫేస్-2 పూర్తి చేయాలని కోరారు మహేష్ కుమార్ గౌడ్.
మెట్రో విస్తరణకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. సబర్మతి నిరాశ్రయులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తాము మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తున్నామని ఉద్ఘాటించారు. మూసీని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని ఉద్ఘాటించారు. మసిపూసి మారేడుకాయ చేసి మెట్రోఫేస్-2 ప్రాజెక్టు పనులని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఫైర్ అయ్యారు మహేష్ కుమార్ గౌడ్.
కవిత వాస్తవాలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కవిత భాగస్వామిగా ఉన్నారని గుర్తుచేశారు. డీసీసీల నియామకం సమర్థవంతంగా కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. కొన్ని జిల్లాల్లో డీసీసీ పదవులకు 30 మందికి పైగా అభ్యర్థన పెట్టుకున్నారని తెలిపారు. నిన్న కేసీ వేణుగోపాల్‌తో జూబ్లీహిల్స్ ఎన్నికలు, డీసీసీ ఎంపికపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారని చెప్పుకొచ్చారు మహేష్ కుమార్ గౌడ్.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి కూడా డీసీసీ పదవికి దరఖాస్తు చేశారనే సమాచారం తనకు ఉందని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారని నొక్కిచెప్పారు. కొన్ని చోట్ల సమర్థవంతులు, అనుభవం ఉన్న వారికి డీసీసీ పదవి ఇవ్వొచ్చని తెలిపారు. ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఉంటాయని వివరించారు. ఎమ్మెల్యేల పదవి అనేది డీసీసీకి అడ్డంకి కాదని స్పష్టం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఐఏఎస్ అధికారి రిజ్వి ఎవరైనా ప్రజలకు జవాబు దారులుగా ఉండాలని సూచించారు. హలోగ్రామ్ టెండర్లు పదేళ్లుగా ఒకటే కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చారో అధికారి రిజ్వి సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్ ఏకపక్షంగా నన్ను బయటకు పంపింది.. కవిత ఎమోషనల్
గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ
Read Latest Telangana News And Telugu News