Kavitha Fires BRS: బీఆర్ఎస్ ఏకపక్షంగా నన్ను బయటకు పంపింది.. కవిత ఎమోషనల్
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:27 PM
బీఆర్ఎస్ ఏకపక్షంగా తనను బయటకు పంపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లో అన్ని బాధ్యతలకు రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకు వచ్చానని కవిత చెప్పుకొచ్చారు.
నిజామాబాద్, అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ (BRS) ఏకపక్షంగా తనను బయటకు పంపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లో అన్ని బాధ్యతలకు తాను రాజీనామా చేసి.. మళ్లీ జనం ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. ఎవరి పనితీరు ఏమిటో రివ్యూ చేసుకుని ఉంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయేది కాదని తెలిపారు. జనంబాటకు చాలామంది అండగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. జనంబాట చేపట్టిన తనపై ఓ ఎంపీ లేనిపోని ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు కవిత. ఇవాళ(ఆదివారం) నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు కవిత జనంబాట కొనసాగుతోంది. మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.
ఆ ఎంపీ చిట్టా బయట పెడతా..
ఎంపీ అర్వింద్ రాజీనామా చేస్తే బీసీ బిల్లు అదే వస్తుందని చెప్పుకొచ్చారు. అతని చిట్టా త్వరలోనే బయట పెడతానని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను అణచి వేస్తోందని ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ కోసం జనంబాట పట్టానని ఉద్ఘాటించారు. ప్రతీ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేపడతానని వివరించారు. మునిగిపోయే పడవ కాంగ్రెస్‌తో తనకేం ఏం సంబంధమని కవిత ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలోని యంచ గ్రామంలో ముంపు ప్రాంతాలను చూశామని చెప్పుకొచ్చారు కవిత.
రైతులు దగా పడ్డారు..
అన్నదాతలకి ఎకరానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 70 వేల ఎకరాల్లో మొక్కజొన్న రైతులు దగా పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 80 శాతం మంది రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి సర్కార్ మరోసారి ఆలోచించాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో అన్నదాతలు ఒక్కో క్వింటాకు రూ.700 నష్టపోయారని వాపోయారు. ధాన్యం తడిసి చెడిపోయిందని తెలిపారు కవిత.
బీజేపీ ఎంపీ ఉన్నా లేనట్లే...
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొక్కజొన్న, వరికి వెంటనే బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో బీజేపీ ఎంపీ ఉన్నా లేనట్లేనని ఎద్దేవా చేశారు. మాధవనగర్ రైల్వే బ్రిడ్జిని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. మాధవనగర్ రైల్వే బ్రిడ్జి విషయంలో కేసీఆర్ హయాంలో తమపై ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. మాధవనగర్ రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేయకుండా ఇప్పుడూ ఎవరూ అడ్డు పడుతున్నారని కవిత ప్రశ్నించారు.
పట్టాలు వెంటనే ఇవ్వాలి..
నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు తెలంగాణ జాగృతి జనంబాట కొనసాగుతోంది. మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు భూముల బాధిత రైతు ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించారు కవిత. అటవీశాఖ అధికారులు గడ్డి మందు కొట్టిన ప్రకాష్ పొలాన్ని పరిశీలించారు. చేతికి వచ్చిన పంటను ధ్వంసం చేయడం సరికాదని పేర్కొన్నారు. రైతు ప్రకాష్ కుటుంబానికి పంట పరిహారాన్ని కలెక్టర్ వెంటనే చెల్లించాని డిమాండ్ చేశారు. ROFR పట్టాలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని కోరారు. మంచిప్ప రిజర్వాయర్ ముంపు తగ్గిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ముంపు గ్రామాల పోడు భూములకు ఎందుకు పట్టాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అత్యుత్సాహంతో ఫారెస్ట్ అధికారులు గిరిజన రైతులను వేధించడం తగదని కవిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుండాలకి రక్షణ కల్పిస్తున్న రేవంత్ ప్రభుత్వం.. ప్రవీణ్ కుమార్ ఫైర్
గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ
Read Latest Telangana News And Telugu News