Share News

Congress VS BJP: రాజ్యాంగం మార్చాడానికి బీజేపీ కుట్ర.. మహేష్ గౌడ్ ఫైర్

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:30 AM

ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు బీజేపీ ఫ్రంటల్ ఆర్గనేషన్‌గా మారిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆక్షేపించారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహుల ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు అని ఉద్ఘాటించారు. కులాల, మతాల పేరిట బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని మహేష్ గౌడ్ విమర్శించారు.

Congress VS BJP: రాజ్యాంగం మార్చాడానికి బీజేపీ కుట్ర.. మహేష్ గౌడ్ ఫైర్
Congress VS BJP

హైదరాబాద్, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం మార్చాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(శనివారం) గాంధీభవన్‌లో క్విట్ ఇండియా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. అలాగే.. ఎలక్షన్ కమిషన్‌పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రదర్శించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర, దేశ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.


స్వాతంత్య్ర ఉద్యమం ఏ విధంగా జరిగిందో నేటి యువత తెలుసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. 1942లో బ్రిటీష్ పాలకులను తరిమి కొట్టాలని అనేక ఉద్యమాలు జరిగినప్పటికీ క్విట్ ఇండియా ఉద్యమం కీలకమైనదని ఉద్ఘాటించారు. డూ ఆర్ డై నినాదంతో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం చేశారని కొనియాడారు. నేడు అధికారంలో ఉన్న బీజేపీ.. కాంగ్రెస్ చరిత్రను తుడిచివేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్.. నెహ్రూ, సర్దార్, సుభాష్ చంద్రబోస్ లాంటి నేతలను చరిత్రలో లేకుండా చేద్దామని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. స్వతంత్ర సంస్థలను వాడుకొని ప్రతిపక్షాలపై మోదీ ప్రభుత్వం కుట్ర పూరిత దాడి చేస్తోందని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్.


ఎలక్షన్ కమిషన్.. బీజేపీ ఫ్రంటల్ ఆర్గనేషన్‌గా మారిందని ఆక్షేపించారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహుల ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు అని ఉద్ఘాటించారు. కులాలు, మతాల పేరిట బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని విమర్శించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక్కరంటే ఒక్కరూ కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు లేరని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ దేశ స్వాతంత్య్ర కోసం ఉద్యమం చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఈ దేశ రక్షణ కోసం పని చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సృష్టి కేసులో వైసీపీ నేత సోదరుడు పాత్రపై అనుమానాలు

మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 09 , 2025 | 11:43 AM