Madhuyashki on Kavitha: బీసీల కోసం కవిత పోరాటమా?.. మధుయాష్కీ ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:35 PM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మోదీ ప్రభుత్వానిది మెతక వైఖరి అని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్‌ను కాళేశ్వరం కేసు నుంచి తప్పించే అవకాశం ఉందని విమర్శించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha)పై మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ (Madhuyashki Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత బీసీల కోసం కోట్లాడటం ఏంటని ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్నను ప్రజలు కొంతవరకు నమ్మే అవకాశముందని... కానీ కవితను నమ్మరని చెప్పుకొచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ నాటకం నుంచి కవిత బయటకు వచ్చిందని తెలిపారు. కవిత ఇన్ని సంవత్సరాల తర్వాత బీసీల గురించి ఎందుకు మాట్లాడుతోందని ప్రశ్నించారు. ఇవాళ(శనివారం) హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు మధు యాష్కీ గౌడ్.
కవితకు ఎవరూ మద్దతిస్తారు..
విమలక్క(Vimalakka)పై కక్షతో హైదరాబాద్‌లో ఎక్కడ ఇల్లు కిరాయికి ఇవ్వకుండా కవిత చేసిందని మండిపడ్డారు. విమలక్క పార్టీ పెడితే ప్రజలు మద్దతిస్తారని... కవిత పెడితే ఎందుకు మద్దతిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. దోచుకుంది దాచుకోవడానికే కవిత జాగృతి పెట్టిందని విమర్శించారు. గతంలో రైతు కుటుంబాలను ఆదుకుంటామని కవిత డబ్బులు వసూల్ చేసిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతారనే తెలిసి బీఆర్ఎస్ నాయకులు ఇప్పటి నుంచే సాకులు వెతుకున్నారని విమర్శించారు. కవిత శవాల మీద పేలలు ఏరుకునే రకమని ఆక్షేపించారు. బీసీ నేత అయినంత మాత్రానా బీసీ అని చూడరని చెప్పుకొచ్చారు. వేరే వర్గాల వాళ్లు బీసీల కోసం కోట్లాడుతామంటేనే ఒప్పుకోవడం లేదని పేర్కొన్నారు మధు యాష్కీ గౌడ్.
రేవంత్‌రెడ్డి అద్భుతంగా పని చేస్తున్నారు..
‘ఐ యామ్ ఫుల్లీ ఫిట్. రెడీ టూ ఫైట్. కాంగ్రెస్‌లో తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఎవరనే చర్చ అవసరం లేదు. దేశంలోనే రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ముఖ్యమంత్రిగా అద్భుతంగా పని చేస్తున్నారు. వేరే రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి రమ్మని రేవంత్‌రెడ్డిని పిలుస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల మోసపోయింది వీకర్ సెక్షన్. రేవంత్‌రెడ్డి వీకర్ సెక్షన్‌కి చాంపియన్‌గా మారారు. తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే చర్చ జరిగితే ప్రభుత్వంలో అస్థిరత ఉందని ప్రజలు అనుకుంటారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తర్వాత ప్రధాని ఎవరని ఒక కీలక తెలుగు నేత సోనియా గాంధీని అడిగితే చెంపలు పగలకొట్టినంత పని చేశారు. రేవంత్‌రెడ్డి ఎవరి వెనక ఉండరు. ముందుండి నడుస్తారు. రేవంత్‌రెడ్డి ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ చేస్తారు. కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయట పడుతోంది. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులపై రైడ్ చేసి అరెస్ట్ చేశారు’ అని మధు యాష్కీ గౌడ్ తెలిపారు.
కేసీఆర్‌పై మోదీ ప్రభుత్వానిది మెతక వైఖరి
‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మోదీ ప్రభుత్వానిది మెతక వైఖరి. కాళేశ్వరం కేసును సీబీఐకి ఇవ్వమని బీజేపీ నేతలు పదేపదే అడిగారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని అంటారు. సీబీఐ ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహారిస్తోందని నమ్ముతున్నాం. మా తదుపరి పోటీ బీజేపీతోనే. బీజేపీ సీక్రెట్‌గా తెలంగాణలో పని చేస్తోంది. బీజేపీ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కుమ్మక్కు అయ్యి చంద్రబాబును అరెస్ట్ చేసింది. కేసీఆర్‌తో బీజేపీ కుమ్మక్కు అయింది. కేసీఆర్‌ను కాళేశ్వరం కేసు నుంచి తప్పించే అవకాశం ఉంది. రిజర్వేషన్లకు రాహుల్ గాంధీ వ్యతిరేకం కాదు. సంపద సమానంగా పంచట్లేదనే మా ఆవేదన’ అని మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News